మహిళా రిపోర్టర్ కు కన్నుగీటిన ఆర్మీ అధికారి.. షాకింగ్ వీడియో!

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐ.ఎస్.పీ.ఆర్.) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన పని ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-12-10 03:50 GMT

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐ.ఎస్.పీ.ఆర్.) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన పని ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి అబ్సా కోమన్ అనే జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన తర్వాత ఆయన ఆమె వైపు కన్నుగీటాడు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

అవును... బ్రీఫింగ్ లోని వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణల గురించి జర్నలిస్టు అడిగినట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన అహ్మద్ షరీఫ్ చౌదరి... ఇమ్రాన్ ఖాన్ ను నార్సిసిస్ట్ అని పిలిచాడు. తాను అధికారంలోకి లేకపోతే, ఇంకేమీ ఉండకుడదు అని అతడు నమ్మాడని అన్నారు. జైలులో ఖాన్ ను కలుస్తున్న వ్యక్తులను సైన్యానికి వ్యతిరేకంగా విషం వ్యాప్తిచేయడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఇదే క్రమంలో... పాకిస్థాన్ సైన్యం, దాని ప్రజల మధ్య చీలికలు సృష్టించడానికి తాము ఎవరినీ అనుమతించమని.. రాజ్యాంగ హక్కులకు పరిమితులు కూడా ఉన్నాయని.. ముఖ్యంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విషయాలకు సంబంధించి కూడా ఉన్నాయని.. ఈ విధంగా ఖాన్ సైన్యం పట్ల శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చౌదరి ఆరోపించారు.

అదే విధంగా... 2023 మే 9న రావల్పిండి ప్రధాన కార్యాలయంతో సహా సైనిక స్థావరాలపై జరిగిన దాడులతో ఇమ్రాన్ ఖాన్ కు సంబంధం ఉందంటూ సైన్యం చేస్తున్న దీర్ఘకాల ఆరోపణలను ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా... ఇమ్రాన్ ఖాన్ ను జాతీయ భద్రతా ముప్పు అని, దేశవ్యతిరేకి అని, ఆయన ఢిల్లీ చేతుల్లోని మనిషి అని కూడా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో... గతానికి భిన్నంగా ఎలా ఉంటుంది.. లేదా, భవిష్యత్తులో ఏదైనా అభివృద్ధిని మనం ఆశించొచ్చా? అని అడగ్గా.. అందుకు స్పందించిన చౌదరి.. ఇమ్రాన్ ఖాన్ మానసిక రోగి కూడా అని చెబుతూ.. ఆ తర్వాత నవుతూ.. జర్నలిస్టు వైపు కన్నుగీటాడు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం ముగిసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



Tags:    

Similar News