స్విస్ బ్యాంకులకు ఇండియన్స్ దూరం

భారత్ లో ధనవంతులు మోతుబరులు అంతా తమ డబ్బులు స్విస్ బ్యాంకులలో దాచుకుంటారు అన్నది తరాలుగా వినిపిస్తున్న మాట.

Update: 2026-06-19 03:44 GMT

భారత్ లో ధనవంతులు మోతుబరులు అంతా తమ డబ్బులు స్విస్ బ్యాంకులలో దాచుకుంటారు అన్నది తరాలుగా వినిపిస్తున్న మాట. దేశంలో గడించిన సొమ్ముని అక్కడ దాస్తే సేఫ్టీ అని భావించే ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటారు. ఇక ఎన్నికల నినాదంగా ఒక దశలో స్విస్ బ్యాంకుల సొమ్ము ఉంటూ వచ్చింది. మేము కనుక అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న నల్ల ధనాన్ని తెచ్చి దేశ సంపదను పెంచుతామని కూడా ప్రామిస్ చేసిన నేతలు ఉన్నారు. అంటే స్విస్ బ్యాంకులలో దాచినది పాపిష్టి సొమ్ము అని బ్లాక్ మనీ అని రకరకాలైన వ్యతిరేక భావజాలాన్నే వ్యాప్తి చేస్తూ వచ్చారు. అయినా సరే స్విస్ బ్యాంకులలో ఎక్కువగా మూలిగేది మన డబ్బులే అని నివేదికలూ చెబుతూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో చూస్తే అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

డబ్బు చేరడం లేదు :

ఈ మధ్య కాలంలో చూస్తే భారత దేశంలో అలవి కాని సొమ్ములు ఉన్న వారంతా స్విస్ బ్యాంకులలో తమ డబ్బుని దాచడం లేదుట. ఇది ఎవరో అన్న మాట కాదు అధికారిక నివేదికలే చెబుతున్నాయి. స్విస్ బ్యాంకులలో ఏకంగా ఇండియన్స్ కి సంబంధించిన నిధులు గడచిన ఆర్ధిక సంవత్సరం 2025-26లో ఏకంగా ఎనిమిది శాతం తగ్గినట్లుగా స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఆ విధంగా చూస్తే స్విస్ బ్యాంకులలో భారతీయ ఖాతాదారులు సంస్థలకు సంబంధించిన నిధులు ఈ విధంగా తగ్గడం దేనికి సూచిక అన్న చర్చ వస్తోంది.

ప్రస్తుతం ఉన్న నిధులు :

ఇక చూస్తే భారతీయులకు సంబంధించిన స్విస్ బ్యాంకులలో 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ నిధులు అక్కడి బ్యాంకులలో ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది. భారత దేశం కరెన్సీ విలువలో ఎ ఈ మొత్తాన్ని లెక్కిస్తే 36, 793 కోట్ల రూపాయలుగా ఉంది అన్న మాట. ఇది 2024 ఆర్ధిక సంవత్సరంలో 3.55 బిలియన్లకు చేరుకుంది. అలాంటిది ఒక ఏడాదిలో 8 శాతం తగ్గింది అంటే కారణాలు ఏమిటి అని అన్వేషిస్తున్నారు. భారీ ఆర్ధిక సంస్థలు బడా దిగ్గజాల నుంచి నిధులు స్విస్ బ్యాంకులలో ఖాతా సొమ్ముగా జమ కాకపోవడం వల్లనే ఈ తగ్గుదల ఉందని అంటున్నారు.

ఒప్పందం వల్లనేనా :

ఇటీవల కాలంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఒక ఆర్ధిక సమాచార మార్పిడి ఒప్పందం కుదిరింది. దాని పేరు ఆటోమేటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీని వల్ల స్విస్ బ్యాంకులలో భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం అయితే ఇండియాకి తెలిసిపోతోంది. ఇలా పారదర్శకంగా వ్యవహారం ఉండడం వల్లనే చాలా మంది బడా బాబులు స్విస్ బ్యాంకులలో దాచడాలు అంత సేఫ్టీ కాదని తగించేశారా అన్న చర్చ వస్తోంది. అయితే తమ బ్యాంకులలో అంతా సక్రమమైన నిధులే ఉంటాయని అక్రమంగా ఎవరూ దాచేది ఉండదని స్విస్ బ్యాంక్ పెద్దలు చెబుతున్నారు. అయినప్పటికీ భయంతో వెనక్కి పోతున్నారు అంటే నలుపు వణుకు ఉందనే అర్ధం అంటున్నారు. ఇక స్విస్ బ్యాంకులలో కేవలం ఇండియన్స్ సొమ్మే కాదు అనేక దేశాల నిధులు ఉన్నాయి. భారత్ ప్రస్తుతం ఆ జాబితాలో 46 ప్లేస్ లో ఉండడం విశేషం.

Tags:    

Similar News