తండ్రి హృదయాన్ని కదిలించిన మధుర క్షణానికి 20 కోట్లు..
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అయితే, ఆ బిడ్డను మొదటిసారి చూడటం తండ్రికి ఒక సరికొత్త అనుభూతి.;
సోషల్ మీడియా ప్రపంచంలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ, స్వచ్ఛమైన భావోద్వేగాలు ఎప్పుడూ నెటిజన్ల మనసు గెలుచుకుంటాయి. తాజాగా చెన్నైకి చెందిన ఒక డాక్టర్ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తొలిసారి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటున్న ఒక తండ్రి పడ్డ కంగారు, ఆ తర్వాత పొందిన ఆనందం కోట్లాది మంది కళ్లను చెమర్చాయి. అక్షరాలా 20 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ మధుర దృశ్యం వెనుక ఉన్న అసలు విషయం చూద్దాం..
తొలి స్పర్శ.. కంగారు పడ్డ తండ్రి :
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అయితే, ఆ బిడ్డను మొదటిసారి చూడటం తండ్రికి ఒక సరికొత్త అనుభూతి. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో లేబర్ రూమ్ బయట తన బిడ్డ కోసం వేచి చూస్తున్న తండ్రికి, డాక్టర్ పసికందును తీసుకువచ్చి అందించారు. "ఇదిగో మీ బిడ్డ" అని ఇస్తుంటే, ఆ తండ్రిలో ఒక్కసారిగా తెలియని కంగారు మొదలైంది. అంత చిన్న ప్రాణాన్ని ఎలా ఎత్తుకోవాలో, ఎక్కడ బిడ్డకి తన చెయ్యి తగులుతుందో, బిడ్డ బాధ కలుగుతుందో అన్న భయంతో ఆయన చేతులు వణకడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అమాయకత్వం, ఆ బాధ్యతాయుతమైన భయం నెటిజన్లను కట్టిపడేశాయి.
భయం నుంచి భావోద్వేగం వరకు:
ఇక డాక్టర్ ఆ తండ్రికి ధైర్యం చెప్పి, బిడ్డను జాగ్రత్తగా చేతుల్లో పెట్టారు. అప్పటివరకు కంగారుపడ్డ ఆ తండ్రి, తన ప్రతిరూపాన్ని గుండెలకు హత్తుకోగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా తన బిడ్డను చూసుకుంటున్న ఆ క్షణం అనిర్వచనీయం. ఇక తండ్రి ప్రేమలో ఉండే గాంభీర్యం వెనుక ఇంతటి సున్నితమైన మనసు ఉంటుందని ఈ వీడియో నిరూపించింది. అందుకే ఈ చిన్న వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులందరినీ తమ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది.
సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్:
సాధారణంగా సినిమాల్లోనో, పెద్ద సెలబ్రిటీల వీడియోలకో ఇలాంటి వ్యూస్ రావడం చూస్తుంటాం. కానీ, ఈ సహజమైన తండ్రి ప్రేమకు అక్షరాలా 20 కోట్ల వ్యూస్ రావడం విశేషం. "నాన్న ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది?" అంటూ నెటిజన్లు వేల సంఖ్యలో కామెంట్లతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఇక లైకులు, షేర్లతో ఈ వీడియో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం చూస్తుంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధాలకు మించిన వైరల్ అంశం ఏదీ లేదని అర్థమవుతోంది. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, ప్రతి తండ్రి జీవితంలో ఉండే అత్యంత విలువైన జ్ఞాపకం.