ఎన్నికల వేళ సోషల్ ప్రచారంపై ఈసీ తాజా ఉత్తర్వులో ఏముంది?

ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.;

Update: 2025-10-15 14:30 GMT

ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఎన్నికల సందర్భంగా పత్రికలు.. టీవీల్లో ప్రకటనలకు సంబంధించిన విధివిధానాలు స్పష్టంగా ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో పెరిగిన సోషల్ మీడియా ప్రకటనల ప్రచారానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వు కీలకంగా మారింది.

గడిచిన పదేళ్ల కాలంలో సోషల్ మీడియా విస్త్రతి పెరగటం.. సోషల్ మీడియాలో ప్రకటన జోరు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. సోషల్ మీడియాతో పాటు.. ఎలక్ట్రానిక్.. వెబ్ లలో ఇచ్చే ప్రకటనలకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జరగనున్న బిహార్.. జమ్మూకశ్మీర్ తో పాటు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న వేళలో.. తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

రాజకీయ పార్టీలు.. అభ్యర్థులు తమ ప్రకటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజుల తర్వాత సమర్పించే లెక్కల్లో కూడా ప్రకటనల నిమిత్తం వివిధ సంస్థలకు చేసిన చెల్లింపుల వివరాల్ని వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ పార్టీకిచెందిన సోషల్ మీడియా ఖాతాలతో పాటు.. అభ్యర్థుల పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈసీకి చెప్పే లెక్కల్లో కంటెంట్ క్రియేషన్ కోసం చేసిన ఖర్చును జత చేయాల్సిందిగా పేర్కొంది. ఈ వివరాల్ని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని.. పెయిడ్ న్యూస్ అన్న అనుమానం వస్తే వాటిపై చర్యలు తీసుకుంటారని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సోషల్ మీడియా మీద ఫోకస్ చేయని ఈసీ ఇప్పుడు దానిపై తన డేగకన్ను వేస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News