లవ్ మనది... పోలీస్ కాపలా మీది.. మేజర్ల సహజీవనంపై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ రూలింగ్
సంగతేంటంటే... ఒక మేజర్ జంట హ్యాపీగా సహజీవనం లవ్ ఇన్ రిలేషన్‌షిప్ చేద్దామని లేదా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు.
మన దేశంలో యువతికి 18 ఏళ్లు, కుర్రాడికి 21 ఏళ్లు రాగానే వాళ్లకు ఓటు వేసే హక్కు వస్తుంది. ప్రభుత్వం ఎవరు నడపాలో తేల్చేంత "పెద్ద మైండ్" వాళ్లకు వచ్చేస్తుందని రాజ్యాంగం నమ్ముతుంది. కానీ అదే 'మేజర్లు' తమ జీవితంలో ఎవరితో కలిసి ఉండాలో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకుందాం అనుకుంటే మాత్రం... మన సమాజానికి, ముఖ్యంగా మన 'పరువు' ప్రేమికులైన తల్లిదండ్రులు, పిన్నిలు, బాబాయిలకు ఎక్కడ లేని బీపీ వచ్చేస్తుంది.. "సమాజం ఏమనుకుంటుంది?", "మన కులం ఏమైపోతుంది?" అంటూ సెంటిమెంట్ డ్రామాలు.. అవసరమైతే చిన్నపాటి వార్నింగ్‌లు.. వినకపోతే పరువు హత్యలు స్టార్ట్ అయిపోతాయి. సరిగ్గా ఇలాంటి లవ్ అండ్ వార్ డ్రామాలోనే ఒక జంటకు ఢిల్లీ హైకోర్టు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది.
సంగతేంటంటే... ఒక మేజర్ జంట హ్యాపీగా సహజీవనం లవ్ ఇన్ రిలేషన్‌షిప్ చేద్దామని లేదా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ యువతి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే అది మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఎందుకవుతుంది? అమ్మాయి నాన్న, అన్నయ్యలు ఎంట్రీ ఇచ్చి "పర్మిషన్ లేకుండా ప్రేమిస్తారా?" అంటూ బెదిరింపుల పర్వం మొదలుపెట్టారు. దెబ్బకు ఆ జంట 'ప్రేమించడం మా హక్కు.. కాపాడండి బాబోయ్' అని ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కింది.
కేసు విచారించిన న్యాయస్థానం ఇచ్చిపడేసేలా కామెంట్స్ చేసింది. "ఇద్దరు మేజర్లు ఇష్టపడి కలిసి ఉంటే మధ్యలో ఈ బంధువులు, స్నేహితుల పంచాయితీ ఏంటి? రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ముందు మీ 'సామాజిక నైతికతలు', ఆచారాల పప్పులు ఉడకవు" అని తేల్చిచెప్పేసింది. అంతటితో ఆగకుండా ఆ ప్రేమికులకు హాయిగా రోమియో-జూలియట్‌లా తిరగడానికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని ఆర్డర్ వేసింది.
కోర్టు తీర్పు సారాంశం సింపుల్‌గా చెప్పాలంటే
మేజర్లు ఎవరితో ఉండాలో వాళ్లే డిసైడ్ చేసుకుంటారు, మధ్యలో ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ అడ్మిన్లు దూరి నాటకాలు ఆడకూడదు. పరువు వర్సెస్ పవర్ అంటూ కులం, మతం, ఆచారం పేరుతో బెదిరిస్తే రాజ్యాంగం ఊరుకోదు. సమాజం ఏమనుకుంటుందో అని కోర్టులు ఆలోచించవు.. చట్టం ఏం చెప్తుందో అదే వింటాయి. బెదిరింపులకు దిగితే ప్రేమికులకు ఉచితంగా పోలీసు రక్షణ దొరుకుతుంది.. మళ్లీ రిస్క్ ఎందుకు చెప్పండి? కాబట్టి పిల్లలు పెద్దయ్యాక వాళ్ల భాగస్వామిని వాళ్లు ఎంచుకుంటే... ముచ్చటగా దీవించడం అలవాటు చేసుకుంటే బెటర్. లేదంటే కోర్టు చుట్టూ తిరగడమే కాకుండా.. వాళ్ల ప్రేమకథకు ఉచితంగా పోలీసు కాపలా పెట్టించే గొప్ప పని కూడా మీరే చేసినవారవుతారు..