• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఢిల్లీ...తల్లఢిల్లీ..గాలి...

ఢిల్లీ...తల్లఢిల్లీ..గాలి పీలిస్తే వామ్మో !

| దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 నుంచి 365 మధ్య నమోదవుతుండగా, ఐఐటీ ఢిల్లీ వద్ద 428కు చేరింది. దీపావళి బాణసంచా, శీతాకాల వాతావరణం కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కళ్ల మంటలు, దగ్గు, శ్వాస సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల నియంత్రణ, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి చర్యలపై దృష్టి పెట్టింది.

By - Satya P
Update: 2026-11-16 04:22 GMT

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. శీతాకాలం వస్తే చాలు ఢిల్లీలో ఎపుడూ ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది అన్నది తెలిసిందే. నవంబర్ నెలలో అది మరింతగా ఎక్కువ అయింది అంటున్నారు. ప్రస్తుతం చూస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత భయంకరంగా ఉంది అని అంటున్నారు. తాజాగా ఉన్న గణాంకాలని చూస్తే ఢిల్లీలో ఏవరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 నుండి 365 మధ్య నమోదైంది. ఇక ఐఐటీ ఢిల్లీ వద్ద 428 గా ఉంటే అనేకమైన ప్రదేశాలలో ఏకంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటి పోయింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.

జబ్బు పడతారు అంతే :

ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గాలి పూర్తిగా కాలుష్య పూరితం అయిందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఢిల్లీకి ఈ సీజన్ లో పెద్ద ఎత్తున వచ్చే పర్యాటకులు కానీ అలాగే దేశ రాజధాని కాబట్టి అనేక రకాలైన పనులు కోసం వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే మాత్రం జబ్బుల బారిన పడడం ఖాయమని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఆదివార అయితే ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉందని అంటున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఎవరూ రోడ్ల మీదకు వచ్చేందుకుకూడా సాహసించడం లేదని అంటున్నారు.

వెరీ బ్యాడ్ :

ఢిల్లీ గాలిలో నాణ్యత బాగా పడిపోయింది అని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఢిల్లీలో వివిధ ప్రాంతాలలో గాలి నాణ్యత వెరీ పూర్ గా ఉందని ఇక మరి కొన్ని ఒచోట్ల తీవ్రమైన పరిస్థితుల్లో ఉందని కూడా పేర్కొంది. ఢిల్లీ రెండు రోజుల క్రితం పేలవమైన గాలి నాణ్యతలో ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టింది. నవంబర్ 13న సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 403కు చేరడంతో అంతర్జాతీయంగా అత్యంత కాలుష్య నగరాల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. దానికి కారణం ఈ నెల 8న జరిగిన దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచాతో వచ్చిన కాలుష్యం అని అంటున్నారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు సహజంగా శీతాకాలంలో పడిపోతాయి. ఇలా ఢిల్లీ గాలి భయపెడుతోంది అనీ అంటున్నారు.

పీలిస్తే ముప్పు :

ఢిల్లీలో అధ్వాన్నమైన గాలిని పీలిస్తే కనుక అనారోగ్యం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు భారీ ఎత్తున పెరుగుతున్నాయని అంటున్నారు. దీంతో కళ్ళలో మంటలు అలాగే గొంతులో సైతం మంటలు అదే పనిగా దగ్గు, ఇక శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కఠినమైన నియమాలను అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం చూస్తోంది. వర్క్ ఫ్రం హోం విధానం తీసుకుని రావాలని చూస్తున్నారు. అదే విధంగా వాహనాలకు కూడా నియంత్రణను పెట్టి కాలుష్య కారకాలను అదుపు చేయాలని చూస్తున్నారు.

Tags:    
  • delhi 
  • delhiairpollution 
  • delhiaqi 
  • airpollution 
  • delhismog 
  • airquality 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS