వైసీపీ మీద కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం

ఏపీ రాజకీయాల్లో అంతా ఒక్క విషయం గమనిస్తున్నారో లేదో కానీ కాంగ్రెస్ నుంచి విమర్శలు అయితే వైసీపీ మీద పెద్దగా లేవు.;

Update: 2025-11-02 03:08 GMT

ఏపీ రాజకీయాల్లో అంతా ఒక్క విషయం గమనిస్తున్నారో లేదో కానీ కాంగ్రెస్ నుంచి విమర్శలు అయితే వైసీపీ మీద పెద్దగా లేవు. అంతే కాదు కూటమి మీద బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల అయితే జగన్ ఊసే దాదాపుగా మరచారు అని అంటున్నారు. ఆమె ఈ మధ్య చాలా తక్కువగానే మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ట్వీట్లు కూడా కొంత తగ్గాయి. ఇక ఆమె చేసే ప్రతీ విమర్శ కూడా అధికార కూటమి మీదనే ఉంది. ఇదంతా దేనికి దీని వెనక ఏముంది, అసలు కాంగ్రెస్ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయి అన్నది అయితే చర్చగానే ఉంది.

పిక్చర్ అయితే క్లియర్ :

జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే కూటమి ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ జనసేన రెండూ ఎన్ డీయేతోనే ఉంటాయన్నది క్లియర్ అయింది. 2029 ఎన్నికల్లో కూడా అంతా కలసి పోటీ చేస్తాయని పై స్థాయిలో ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకోవడమే కాదు దానిని గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ కి కూడా పంపిస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల క్యాడర్ గందరగోళం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఏపీలో రాజకీయమే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.

కాంగ్రెస్ స్ట్రాటజీ :

మరో వైపు చూస్తే కాంగ్రెస్ కూడా సౌత్ వైపు చూస్తోంది. తెలంగాణలో ఎటూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏపీలో అంత సత్తా లేనప్పటికీ పొత్తుల కోసం అయితే కాంగ్రెస్ చూస్తోంది. టీడీపీ జనసేనలతో బీజేపీకి పొత్తు ఉంది. మరో వైపు కమ్యూనిస్టులు ఏపీలో ఉన్నారు, వారు కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో ప్రయాణిస్తున్నారు 2029 నాటికి ఏపీలో కూడా ఇండియా కూటమి బలంగా నిర్మించాలని కాంగ్రెస్ పెద్దల ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. జగన్ ఓడినా కూడా 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. అంతే కాదు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు జనాదరణ అన్నది కనిపిస్తోంది. దాంతో ఏపీలో వైసీపీ ఇక కీలకమైన రాజకీయ శక్తిగా ఉంది.

బీహార్ తరువాతనే :

బీహార్ మీద కాంగ్రెస్ కి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈసారి అక్కడ మహా ఘట్ బంధన్ కూటమి గెలిచి తీరుతుందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున నమ్మకాలు పెట్టుకుంది. అంతే కాదు ఒక్క బీహార్ ఫలితంతో జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు పుడతాయని కూడా లెక్క వేస్తోంది. ఇక దేశంలో అందునా హిందీ బెల్ట్ లో ఒక పెద్ద రాష్ట్రంలో కనుక గెలిస్తే తప్పకుండా ఆ ప్రభావంతో జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయని అలాగే ఇండియా కూటమిలోకి అనేక పార్టీలు వస్తాయని కూడా భావిస్తోంది. ఇక ఏపీలో చూస్తే కచ్చితంగా కదలిక వస్తుందని భావిస్తున్నారు అని అంటున్నారు.

2029 ఎన్నికలు అగ్ని పరీక్ష :

వైసీపీ విషయంలో . అందుకే వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే 2029 ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. ఈ ఎన్నికలు చావో రేవోలా ఉండబోతున్నాయి. అందుకే 2024 మాదిరిగా కాకుండా అందివచ్చిన అన్ని అవకాశాలు వైసీపీ కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయాల్లో కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంటుంది. సో కాంగ్రెస్ వ్యూహాలు వైసీపీ అనివార్యతలు ఏపీ రాజకీయ పరిస్థితులు జాతీయ స్థాయిలో కనుక భారీ మార్పులు వస్తే తప్పకుండా ఏదో ఒక విధమైన ఒడ్డుకు పాలిటిక్స్ ని చేర్చే చాన్స్ అయితే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News