ఓబీసీలను టార్గెట్ చేసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఓబీసీ సీనియర్ నేతల నుంచి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు.;

Update: 2025-06-23 03:00 GMT

కాంగ్రెస్ అగ్ర నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ దేశంలోని ఓబీసీలను టార్గెట్ చేశారు. తొందరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుపు కోసం పదునైన వ్యూహాలను కాంగ్రెస్ రచిస్తోంది. అందులో భాగంగా ఓబీసీలను ఆకట్టుకోవాలని చూస్తోంది.

కేవలం బీహార్ ఎన్నికల్లోనే కాకుండా దేశంలో పెద్ద శాతంగా ఉన్న ఓబీసీలను కాంగ్రెస్ వైపు తీసుకుని రావడం ద్వారా భారీ ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున త్వరలో కులగణన మీద ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఓబీసీ టీం ని కూడా ఎంపిక చేయనుంది అని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఓబీసీ సీనియర్ నేతల నుంచి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. ఈ ప్రత్యేక బృందంలో 24 మంది దాకా ఓబీసీ నేతలు ఉంటారని చెబుతున్నారు. ఇక ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే కనుక కర్ణాటక సీఎం కె.సిద్ధరామయ్య, మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, ఎం.వీరప్ప మొయిలీ, భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు బీకే హరిప్రసాద్, సచిన్ పైలట్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, గుజరాత్ విపక్ష నేత అమిత్ చవ్దా, ఏఐసీసీ నుంచి అజయ్ కుమార్ లల్లూ, జితేంద్ర బఘేల్ తదితరులు ఈ ప్రత్యేక బృందంలో ఉంటారని పేర్కొంటున్నారు.

దేశంలో ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి స్థితిగతులు వర్తమాన జీవన చిత్రం, వారి ఆకాంక్షలు, ప్రభుత్వాల నుంచి వారికి అందని సహాయం వంటి వాటిని పొందుపరుస్తూ ఓబీసీల మీద ఒక బ్లూ ప్రింట్ ని కూడా తయారు చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అంటున్నారు.

వీటిని తయారు చేసిన తరువాత ఈ సీనియర్ కూడిన ఓబీసీల ప్రత్యేక బృందం ద ఓబీసీలను అవగాహన కల్పిచడంతో పాటు వీలైనన్ని వేదికల మీద చర్చలకు అవకాశం ఇస్తుంది అలాగే చట్ట సభల లోపలా బయటా కూడా ఓబీసీల అంశాన్ని చర్చించనుంది.

ఓబీసీలలో ప్రముఖ నేతలను రంగంలోకి దించడం ద్వారా కాంగ్రెస్ ఒక భారీ రాజకీయ ప్రయోగాన్నే చేస్తోంది అని అంటున్నారు. ఓబీసీ నేతలతో కూడిన కమిటీకి కన్వీనర్‌గా ఏఐసీసీ ఓబీసీ విభాగాధిపతి అనిల్ జైహింద్ వ్యవహరిఇస్తారని అంటున్నారు. అంతే కాదు ఓబీసీల మీద పూర్తి స్థాయిలో సమస్యలు లేవనెత్తుతూ వారిని పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

అదే సమయంలో కులగణన మీద బీజేపీకి చిత్తశుద్ధి లేదని దేశానికి చాటనుంచి అని అంటున్నారు. బీజేపీ కేవలం బీహార్ తో పాటు మరికొన్ని ఎన్నికల కోసమే కులగణన అన్నది చేపట్టినట్లుగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిజానికి బీజేపీ 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి ఉంటే ఈపాటికి నివేదిక వచ్చి ఉండేదని అంటున్నారు

అలా కాకుండా 2027 మార్చి దాకా వ్యవధిని ఇవ్వడం ద్వారా ఆ పేరు చెప్పి యూపీతో సహా అనేక కీలక రాష్ట్రాలలో ఎన్నికలలో గెలవడమే ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక కులగణన మీద మొదట మాట్లాడిందే కాంగ్రెస్ అని ఆ పార్టీ పెద్దలు అంటున్నారు. ఆ విధంగా ఓబీసీల మద్దతుని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోందని అందువల్ల ఓబీసీలతో పాటు అన్ని వర్గాల మద్దతు తమ పార్టీకే ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఓబీసీలను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో.

Tags:    

Similar News