జే&కే లో ఆర్టికల్ 370 గురించి ఫోన్ లో సెర్చ్.. ఎవరీ చైనా జాతీయుడు..?

అవును... లడఖ్, కశ్మీర్ గుండా సుమారు రెండు వారాలకు పైగా అనుమతి లేకుండా ప్రయాణించిన 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.;

Update: 2025-12-09 06:28 GMT

వీదేశీయులు టూరిస్టు వీసాలపై దేశంలోకి పర్యటించినప్పుడు వారు ఏయే ప్రాంతాలను సందర్శించొచ్చు అనే అనుమతి నిబంధనలు ఉన్నప్పుడు కూడా భారత్ లో వీసా నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా లడఖ్, కశ్మీర్ లోని వ్యూహాత్మక, సున్నితమైన ప్రాంతాలను సందర్శించాడో చైనా వ్యక్తి. దీంతో.. అతన్ని శ్రీనగర్ లో అదుపులోకి తీసుకుని, అతని ఫోన్ ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు.

అవును... లడఖ్, కశ్మీర్ గుండా సుమారు రెండు వారాలకు పైగా అనుమతి లేకుండా ప్రయాణించిన 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఇతడు గ్యాంగ్ డాంగ్ ఫ్రావిన్స్ లోని షెన్ జెన్ ప్రాంత నివాసి హు కాంగ్టై గా గుర్తించారు అధికారులు. ఇదే సమయంలో.. శ్రీనగర్ లోని విదేశీయుల రిపోర్టింగ్ నిబంధనలను ఉల్లంఘించే వసతి సౌకర్యాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపారు.

వాస్తవానికి ఇతడికి ఢిల్లీ, యూపీ, రాజస్థాన్ లోని బౌద్ధ మత ప్రదేశాలకు మాత్రమే ప్రయాణించడానికి అనుమతించే పర్యాటక వీసా ఉంది. దీనిపై అతడు నవంబర్ 19న ఢిల్లీకి వచ్చాడు. అయితే.. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోకుండానే.. లడఖ్, జమ్మూ & కశ్మీర్ లను సందర్శించాడు. ఈ సమయంలో అతడు స్థానిక మార్కెట్ లో భారతీయ సిమ్ కార్డును పొందాడని అధికారులు తెలిపారు.

అదేవిధంగా... అతని మొబైల్ ఫోన్ ను స్కాన్ చేయగా.. కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ మొహరింపులు, ఆర్టికల్ 370 మొదలైన ప్రశ్నలకు సంబంధించిన సెర్చ్ లు బయటపడ్డాని చెబుతున్నారు. ఇతడు భారత్ లో కంటే ముందు అమెరికా, న్యూజిలాండ్, హాంకాంగ్, ఫిజి, బ్రెజిల్ వంటి దేశాల్లో ప్రయాణించాడని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే నవంబర్ 19న ఢిల్లీకి వచ్చి, డిసెంబర్ 1న శ్రీనగర్ చేరుకుని.. ఒక రిజిస్టర్ కాని అతిథి గృహంలో బస చేశాడని తెలిపారు. అనంతరం.. హర్వాన్ బౌద్ధ ఆరామం, శంకరాచార్య కొండలు, దాల్ సరస్సు వెంబడి ఉన్న మొఘల్ గార్డెన్, ఆర్మీ విక్టర్ ఫొర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలోని అవంతిపూర్ శిథిలాలు వంటి అనేక ప్రదేశాలను సందర్శించినట్లు భావిస్తున్నారు!

ప్రస్తుతం అతడిని విచారణ కోసం శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలోని బుడ్గాం జిల్లాలో గల హమ్హామా పోలీసు పోస్టుకు తరలించారు. ఈ సందర్భంగా భారత్ లో అతని కార్యకలాపాలు, పర్యటనల చుట్టూ ఉన్న రహస్యన్ని ఛేధించడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News