అక్కడ పోటీకి దిగిన మరో ‘బర్రెలక్క’

అయితే తాజాగా చత్తీస్‌గఢ్‌లోని కోర్బా లోక్ సభ నియోజకవర్గం నుండి మరో బర్రెలక్క నామినేషన్ వేయడం గమనార్హం.

Update: 2024-04-28 10:30 GMT

డిగ్రీ చదువుకుని బర్రెలు కాస్తున్నానని సోషల్ మీడియాలో కలకలం రేపి ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కొల్లపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరిదృష్టిని ఆకర్షించిన బర్రెలక్క ఆలియాస్ కర్నె శిరీష విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో 5 వేలు సాధించిన శిరీష ఇటీవల పెళ్లి చేసుకుని నాగర్ కర్నూలు లోక్ సభ నుండి ఎంపీగా మరోసారి పోటీకి దిగింది.

అయితే తాజాగా చత్తీస్‌గఢ్‌లోని కోర్బా లోక్ సభ నియోజకవర్గం నుండి మరో బర్రెలక్క నామినేషన్ వేయడం గమనార్హం. ఆమె అసలు పేరు శాంతిబాయి మారావి. కనీసం పాన్ కార్డ్ కూడా లేని ఆమెకు రెండు బ్యాంక్ అకౌంట్లలో ఒక దాంట్లో రూ.2 వేలు మాత్రమే ఉండగా, మరో దాంట్లో ఒక్క రూపాయి కూడా లేదు.

కోర్బా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోత్స్నా మహంత్, బీజేపీ తరపున సరోజ్ పాండే బరిలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. అర్థబలం, అంగబలం లేకపోయినా కోటీశ్వరులతో పోటీ పడుతున్నది.

సామాన్యురాలు అయిన శాంతిబాయికి చేతిలో రూ. 20 వేల నగదు, 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఉంది. ఆమె చదివింది ఐదవ తరగతే కావడం విశేషం. ఇక ఆమెకు అసలు సోషల్ మీడియా అంటే తెలియదు. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆమెకు వ్యవసాయం, కూలిపనులే జీవనాధారం కావడం గమనార్హం.

Tags:    

Similar News