టీడీపీని మోసింది.. మోస్తోంది.. వారే: చంద్ర‌బాబు

భ‌విష్య‌త్తులోనూ కార్య‌క‌ర్త‌లే పార్టీని మోయాల్సి ఉంటుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. వారి బాగోగుల‌ను పార్టీ చూస్తుంద‌న్నారు.

Update: 2026-05-28 20:19 GMT

టీడీపీకి ఆది నుంచి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. 1983లో పార్టీని స్థాపించిన‌ప్పుడు.. కార్య‌క‌ర్త‌లే ఇంటింటికీ ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసు కువ‌చ్చేందుకు ఎన్టీఆర్ చైత‌న్య ర‌థ యాత్ర చేస్తే.. కార్య‌క‌ర్త‌లు .. ఇంటింటి యాత్ర చేసి.. పార్టీని బ‌లోపే తం చేసేందుకు కృషి చేశార‌ని చెప్పారు. కార్య‌క‌ర్త‌లే.. నాడు.. నేడు కూడా పార్టీని మోస్తున్నార‌ని వెల్ల‌డిం చారు.

భ‌విష్య‌త్తులోనూ కార్య‌క‌ర్త‌లే పార్టీని మోయాల్సి ఉంటుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. వారి బాగోగుల‌ను పార్టీ చూస్తుంద‌న్నారు. పార్టీ స‌భ్య‌త్వం ఉన్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కూ.. బీమా వ‌ర్తింప చేస్తున్న‌ట్టు తెలిపారు. వారి పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను కూడా తీసుకున్నామ‌న్నారు. ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త కుటుంబానికీ పా ర్టీ అండ‌గా ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. కార్య‌కర్త‌ల క‌ష్టంతోనే పార్టీ ప‌దే ప‌దే అధికారంలోకి వ‌స్తోంద‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కార్య‌క‌ర్తే-అధినేత అనే నినాదాన్ని పార్టీ ఆక‌ళింపు చేసుకుంద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా ముందుం టున్నామ‌ని చెప్పారు. `మై టీడీపీ` యాప్ ద్వారా కార్య‌క‌ర్త‌లు త‌మ ఇబ్బందుల‌ను పార్టీ అధిష్టానం దృష్టికి నేరుగా తీసుకురావ‌చ్చ‌న్నారు. పార్టీకి-కార్య‌కర్త‌ల‌కు మ‌ధ్య మై టీడీపీ యాప్ వార‌ధిగా ప‌నిచేస్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాయ‌కుల‌తో ఒక్కొక్క సారి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. కార్య‌క‌ర్త‌లు కూడా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు.

ఇంటింటికీ తిరిగే బాధ్య‌త‌ను చూస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని వాటిని పార్టీ దృష్టికి తీసుకురావాల‌ని చెప్పారు. త‌ద్వారా వాటిని ప‌రిష్క‌రించుకుని భ‌విష్య‌త్తులో ముందుకు వెళ్లేందు కు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. విష‌యం ఏదైనా రోడ్డున ప‌డ‌డం మంచిది కాద‌ని.. యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకువ‌చ్చి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను గౌర‌వించ‌డం నాయ‌కుల‌కు కూడా అవ‌స‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News