తెలిసిందా జగన్.. బాబు కూడా లైట్ తీసుకున్నారు.. !
రైతులకు తాను ఏం చేసాను.. పొగాకు విషయంలోనూ అదే విధంగా మామిడికాయల విషయంలోనూ ఎటువంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.;
వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ ఇచ్చే పరిణామం జరిగింది. ఆయన ఏమన్నా ఏం మాట్లాడినా గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా కొంతమంది నాయకులు పట్టించుకునేవారు. తీవ్రంగా స్పందించేవారు. ఎదురుదాడి కూడా చేసేవారు. అయితే రాను రాను జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం.. దీంతోపాటు లేనిపోనివి కూడా చెబుతున్నారన్న వాదన కూడా బలపడుతోంది. ఈ వ్యవహారంపై చంద్రబాబు తాజాగా అసలు జగన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక్క మాటతో తేల్చి పడేసారు. జగన్ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం మరో విశేషం.
ఎందుకంటే వాస్తవానికి రాజకీయాల్లో చంద్రబాబు చాలా సునిసితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ సహా ఎవరన్నా తనపై విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. కానీ ఇది గతం మాట. ఇప్పుడు మాత్రం జగన్ చెబుతున్న మాటలకు స్పందించాల్సిన అవసరం లేదనే చంద్రబాబు తేల్చేశారు. అంతేకాదు అసలు జగన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. దీంతో జగన్ కు చంద్రబాబు ఇస్తున్న వాల్యూ ఏంటనేది స్పష్టమైంది. నిజానికి నెల రోజుల కిందట జగన్ మీడియా ముందుకు వచ్చి పలు విమర్శలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు వెంటనే స్పందించారు.
రైతులకు తాను ఏం చేసాను.. పొగాకు విషయంలోనూ అదే విధంగా మామిడికాయల విషయంలోనూ ఎటువంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కానీ తాజాగా జగన్ మీడియా ముందు రెండున్నర గంటల పైగా మాట్లాడినప్పటికీ చంద్రబాబు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం ద్వారా జగన్‌ను డైల్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టం అవుతుంది. తద్వారా ప్రజల్లోనూ ఇకపై జగన్ గురించి పెద్దగా చర్చ ఉండే అవకాశం ఉండదని కూడా భావిస్తున్నారు.
వాస్తవానికి జగన్ చేసిన కామెంట్లపై చంద్రబాబు కనక మళ్ళీ రియాక్ట్ అయితే ఆ స్పందన ప్రజల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అసలు స్పందించాల్సిన అవసరమే లేదన్నది చంద్రబాబు చెప్పిన మాట. ఈ నేపథ్యంలో ఇక పై జగన్ గురించిన ప్రస్తావన వచ్చే అవకాశం లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తుందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఇదే జరిగితే.. జగన్ వాల్యూ మరింత డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే పట్టించుకునే వారు ఉంటేనే కదా.. ఏదైనా వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇప్పటికే జగన్‌ను 30 శాతం మంది పట్టించుకోవడం లేదన్న విషయం తెలిసిందే.