బీహార్ సీఎం నితీష్ కాదు....బిగ్ ట్విస్ట్ ?
బీహార్ ఎన్నికల్లో బీహార్ 93 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అంతే కాదు మరో మిత్ర పక్షం అయిన ఎల్జేపీ కూడా 23 సీట్ల దాకా గెలుచుకుంది.;
బీజేపీ జేడీయూ సక్సెస్ ఫుల్ కాంబోతో బీహార్ లో మొత్తానికి మొత్తం సీట్లు దోచేశారు. విపక్షానికి పూర్తిగా బలహీన పక్షం చేసేశారు. ఎన్నడూ లేని విధంగా బీహార్ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఎన్డీయే దుమ్ము రేపింది. అంతే కాదు బీహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ కి ఇది రికార్డు షాయి విషయం ఆయన ఇప్పటికి తొమ్మిది సార్లు సీఎం గా ప్రమాణం చేసారు. నాలుగు ఏకంగా రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి గెలుపుతో పదవసారి ఆయన సీఎం గా ప్రమాణం చేసి కుర్చీ అధిషించాలని చూస్తున్నారు. బీహార్ లో జేడీయూ సాధించిన విజయం తక్కువ ఏమీ కాదు, ఏకంగా 101 కి 84 సీట్ల దాకా సాధించింది. దాంతో నితీష్ కాబోయే సీఎం అని అంతా అంటున్నారు.
జేడీయూ హింట్ :
ఈ నేపధ్యంలో శుక్రవారం ఒక వైపు రిజల్ట్స్ వస్తూండంగా జేడీయూ కార్యకర్తలు సోషల్ మీడియాలో నితీష్ సీఎం అంటూ మళ్ళీ ఆయనే అని ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో సడెన్ గా ట్వీట్లు అన్నీ డిలిట్ అయిపోయాయి. దాంతో ఏమి జరుగుతోంది అన్నదే అంతటా చర్చగా ఉంది. నితీష్ కుమార్ సీఎం కారా, ఆయన ప్లేస్ లో ఎవరు అన్నది కూడా సరికొత్త చర్చకు దారి తీస్తోంది.
బీజేపీ పెద్ద పార్టీ :
బీహార్ ఎన్నికల్లో బీహార్ 93 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అంతే కాదు మరో మిత్ర పక్షం అయిన ఎల్జేపీ కూడా 23 సీట్ల దాకా గెలుచుకుంది. ఇతర మిత్రులు అందరికీ కలిపితే మెజారిటీ మార్క్ సాధించవచ్చు. ఇక జేడీయూ ని ఈసారికి పక్కన పెట్టేసి బీజేపీ ముంచి అభ్యర్ధిని ముఖ్యమంత్రిగా చేయాలని కాషాయం పార్టీ ఆలోచిస్తోంది. ఎన్నికల ముందు కూడా ఇదే వినిపించింది. అయితే దానిని ఎన్డీయే నేతలు కొట్టిపారేశారు. కానీ నితీష్ మా సీఎం అభ్యర్ధి అని చివరిలో ఒకటి రెండు సందర్భాలలో తప్ప స్పష్టంగా ఎక్కడా చెప్పలేకపోయారు.
మహారాష్ట్ర ఫార్ములా :
ఇక మహారాష్ట్రంలో చూసుకుంటే అక్కడ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీతో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని మాత్రం తాను చేపట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం గా చేసి మిత్రులు ఇద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇపుడు అదే ఫార్ములాను బీహార్ లో కూడా అమలు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. నితీష్ కుమార్ ని పక్కన పెట్టి సామ్రాట్ చౌదరిని కొత్త సీఎం గా చేయాలని బీజేపీ చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి గా :
ఇక ఎవరీ సామ్రాట్ చౌదరి అంటే అంగబలం అర్ధ బలం ఉన్న వారు, బీజేపీకి గట్టి నాయకుడు, ప్రసుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే 2025లో సీఎం అవుతారు అని అంతటా ప్రచారం సాగింది. ఇపుడు ఇదే జరగబోతోంది అని అంటున్నారు. హిందీ బెల్ట్ లో అన్ని రాష్ట్రాలలో బీజేపీ సీఎం పదవులు అందుకున్నారు కానీ ఒక్క బీహార్ లో మాత్రం అది జరగలేదు. దాంతో ఈసారి ఆ ముచ్చట తీర్చుకోవాలని బీజేపీ కచ్చితంగా ఒక ఆలోచనలో ఉంది అని అంటున్నారు. మరి నితీష్ కుమార్ ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా లేక ఆయనకు కేంద్రంలో ఇంతకు మించి కీలక పదవి ఇచ్చి సర్దుబాటు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.