బీహార్ పోరు: బీజేపీ హవాను తట్టుకుంటేనే.. నితీష్ భవిత!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. వచ్చే నెల 6, 11 తేదీలలో రెండు దశల్లో 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. వచ్చే నెల 6, 11 తేదీలలో రెండు దశల్లో 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ పోరు సాదాసీదా కాదు!. ఏదో ఒక ఎన్నికలు మాత్రమే కాదు.. ఒక పార్టీకి, ఒక నేతకు.. కూడా పెద్ద పరీక్ష. అంతకన్నా.. అగ్నిపరీక్షేనని చెప్పాలి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆ పార్టీ-ఆనేత ఇద్దరూ కూడా కలిసే ఉన్నా రు. కలివిడిగానే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అటు కేంద్రంలోనూ కలిసి సాగుతున్నారు. అయితే.. చిత్త చాప ల్యం.. చాంచల్యం రెండూ ఉన్న ఆ నేత.. సీఎం నితీష్ కుమార్.. ఎలాంటిఅడుగులు వేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.
ఎందుకంటే.. కలిసి ఉంటే కలదు సుఖం.. అని అనుకునే పరిస్థితి బీజేపీకి లేదు. ఎందుకంటే.. 2020లో బీజేపీ.. నితీష్ పార్టీ జేడీయూతో కలిసి అడుగులు వేసింది. రెండు పార్టీలు కూడా.. కలివిడిగానే ఎన్నికలకు వెళ్లాయి. ఇరు పార్టీలు కలిస్తే.. మెజారిటీ కూడా వచ్చింది. 2020 ఎన్నికల్లో జేడీయూకు.. 71 సీట్లు, బీజేపీకి 80 సీట్లు వచ్చాయి. రెండూ కలిపితే.. 151.. అంటే.. మెజారి టీ సాధించారు. కానీ, సీఎంసీటు విషయంలో బీజేపీ-నితీష్‌కు మధ్య ఏర్పడిన వివాదంతో ఆయన చెప్పాపెట్టకుండానే.. ఆర్జేడీతో చేతులు కలిపారు. అంటే.. అప్పటి వరకు మోసిన బీజేపీని పక్కన పెట్టేశారు. అయితే.. తర్వాత.. కాలంలో అంటే.. 2023లో మాత్రం మరోసారి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. గత ఏడాది కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు.
సో.. దీనిని బట్టి.. నితీష్ చిత్త చాంచల్యంపై ముందుగానే ఒక అంచనాకువ చ్చిన.. బీజేపీ.. ఆయనను నమ్ముతున్నట్టే నటిస్తోం ది.. కలిసి ఉన్నట్టే వ్యవహరిస్తోంది. కానీ.. అవకాశం-అవసరం కోసం.. ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నితీష్ తనపట్టును నిలబెట్టుకుంటారా... లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారు. తరచుగా అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడుపొత్తుపై ఎన్నికలకు వెళ్లినా.. నవంబరు 14న(ఎన్నికల ఫలితం వచ్చే నాటికి) మళ్లీ సీఎం సీటుపై వివాదం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. మళ్లీ సీఎం నేనే అని నితీష్ బహిరంగంగా అనలేక పోతున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా అంతర్మథనంతోనే ఉంది.
ఈ నేపథ్యంలో కలిసి ఉన్నా.. సుఖం లేని ప్రయాణం మాదిరిగానే బీహార్‌లో బీజేపీ-నితీష్ వ్యవహారాలు ముందుకు సాగుతు న్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీదూకుడును తట్టుకునే అవసరం నితీష్‌కు ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుత ఎన్నికల్లో కనీసంలో కనీసం తామే 150 స్థానాల్లో పోటీకి దిగుతామని.. బీజేపీ అంతర్గత చర్చల్లో చెబుతోంది. తద్వారా.. ఏకపక్షంగా విజయం దక్కించుకుంటే.. రేపు నితీష్‌ను పార్టీనే పక్కన పెడుతుంది. అందునా.. నితీష్ మతిమరుపు, అనారోగ్యాలపై అంతర్గత ప్రచారం కూడా జరుగుతోంది. అలాగని బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే.. కేంద్రంలో తమకు మద్దతు ఉపసంహరించే అవకాశం ఉంటుందన్న భీతి కూడా బీజేపీని వెంటాడుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. బీజేపీ హవాను తట్టుకోవాల్సింది.. నితీషేనన్నది సుస్పష్టం. మరి ఏం చేస్తారో చూడాలి.