టీడీపీ వర్సెస్ వైసీపీ... ఎవరి ట్రాప్ లో ఎవరు ఇరుక్కున్నారు ?
నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అని పురాణ పద్యం ఒకటి ఉంది. అలాగే రాజకీయాల్లో టిట్ ఫర్ టాట్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్ లు ఉంటాయి.
నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అని పురాణ పద్యం ఒకటి ఉంది. అలాగే రాజకీయాల్లో టిట్ ఫర్ టాట్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్ లు ఉంటాయి. 2021లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ నాడు చేసినది నేడు అధికార టీడీపీ కూటమి చేస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో ఆనాటి వైసీపీ రాజకీయం మీద ఏహ్య భావం ఏర్పడింది. మరి ఈనాటి తీరు మీద టీడీపీ కూటమి పైన అదే ఏహ్య భావం ఏర్పడాలని వైసీపీ ట్రాప్ వేసిందా అన్న చర్చ సాగుతోంది. ఆనాటికీ నేటికీ తేడా ఏంటి అంటే అప్పట్లో మునిసిపోల్స్ వరకే టీడీపీ పోటీ చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించింది. దాంతో వైసీపీ పని మరింత సులువు అయింది అని అంటారు. అయితే ఇపుడు వైసీపీ ఆ పని చేయడం లేదు, పోటీలో ఉంటోంది. నామినేషన్ల దాకా తమ వారిని తీసుకుని వెళ్తోంది. ఎటూ నామినేషన్లు ఆమోదం పొందవని తెలుసు కాబట్టి టీడీపీ చేసే దాడులను బయటపెట్టాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
జగన్ చెప్పేది ఇదే :
జగన్ అయిదేళ్ళు సీఎం గా చేశారు. తమ హయాంలో స్థానిక సంస్థలకు ఏమి జరిగిందో కూడా తెలుసు. ఇపుడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది. నామినేషన్లు వేయడం అంత ఈజీ కాదని కూడా వైసీపీ పెద్దలకు తెలుసు. అయినా ఏకగ్రీవాలు వద్దు అని జగన్ ఆదేశించారు అంటే టీడీపీ వర్సెస్ వైసీపీగా నామినేషన్ కేంద్రాల వద్ద జరిగే ఘర్షణలు దాడులతో అధికార పార్టీ దౌర్జన్యం చేసింది అని బయట పెట్టడానికే అంటున్నారు. ఎన్నికలు బాయ్ కాట్ చేస్తే ఈ రకమైన సన్నివేశాలు కానీ కోర్టుల దాకా వెళ్ళి ఎస్ ఈసీని ఆదేశించిన విధంగా తీర్పులు కానీ రావు అన్నది తెలిసిందే. ఇవన్నీ వైసీపీ చేస్తోంది అంటే వైసీపీ టీడీపీని ట్రాప్ లోకి లాగిందా అన్నదే చర్చగా ఉంది.
గెలుపు కాదన్నదే :
ఇంత చేసి టీడీపీ కూటమి గెలిచినా అది గెలుపు కాదు అన్నది చాటి చెప్పడం కూడా వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది అని అంటున్నారు. అందుకే ఇవి ఎన్నికలేనా ఇలాగేనా నిర్వహించేది అని వైసీపీ పదే పదే ప్రశ్నిస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో గెలుపు కంటే కూడా టీడీపీ విజయాన్ని తక్కువ చేసి చూపించడం, అలాగే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లోకానికి చాటడమే వైసీపీ వ్యూహమగా ఉంది అని అంటున్నారు. మామూలుగా ఎన్నికలు జరిగినా కూడా అధికార కూటమికే మొగ్గు ఉంటుంది. కాకపోతే కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం అయినా వైసీపీకి సీట్లు వచ్చేవి. కానీ టీడీపీని వైసీపీ ముగ్గులోకి లాగిందా లేక గత అనుభవాలు టీడీపీకి జ్ఞప్తికి వచ్చి ఇలా చేస్తున్నారా అన్నది పక్కన పెడితే మొత్తానికి నామినేషన్ల పర్వంలోనే ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల విపక్ష వైసీపీ అయితే బాధిత పాత్రలోనే తాను ఉన్నాను అంటోంది. ఇది ఏపీలో చర్చగా జరగాలని కోరుకుంటోంది.
టీడీపీ వ్యూహం :
ఇక్కడ టీడీపీ వ్యూహం అయితే పాతదే, అందరికీ తెలిసిందే. ఎటూ వైసీపీ ఎన్నికల్లో గెలవలేక పారిపోతూ నిందలు వేస్తోంది అన్నది టీడీపీ నేతల విమర్శలు. నామినేషన్లు కూడా వేసేందుకు వైసీపీకి అభ్యర్ధులు లేదన్నది మరో వాదన. అయితే ఏపీలో ఇపుడు నామినేషన్ల పర్వంలో జరుగుతునన్ ఘటనకు దాడులు అన్నీ చూస్తున్న జనాలు మాత్రం వీటి పైన ఎవరికి వారుగా నిర్ణయించుకుంటారు. మొత్తానికి వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన ఈ స్థానిక పోరులో గెలుపు కంటే వ్యూహాలతోనే అసలు ఆట సాగింది. విజేత ఎవరు అన్నదే అసలైన చర్చ.