గొడ్డలి పార్టీయేనట...బూమరాంగ్ అవుతుందా ?

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. సంప్రదాయ బౌండరీస్ దాటి మరీ హాట్ కామెంట్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.

Update: 2026-06-06 18:28 GMT

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. సంప్రదాయ బౌండరీస్ దాటి మరీ హాట్ కామెంట్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపధ్యంలో వైసీపీ మీద టీడీపీ విమర్శలు చేస్తూ అల్టిమేట్ అన్నట్లుగా గొడ్డలి పార్టీ అని పేరు తగిలించేసింది. గత కొన్నాళ్ళుగా వైసీపీని ఆ పేరుతోనే పిలుస్తోంది. వైసీపీ పేరు పెట్టి పిలవడం అన్నది టీడీపీ దాదాపుగా మరచిపోయింది. ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తోంది. జనం మనసులో వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అన్నది స్ట్రైక్ కావాలన ఎత్తుగడతోనే టీడీపీ ఈ విధంగా చేస్తోంది. అయితే వైసీపీని గొడ్డలి పార్టీ అంటే టీడీపీని వెన్నుపోటు పార్టీ అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. కానీ అది ఏమంత వర్కౌట్ కాలేదు. పైగా వైసీపీ తన మీద వస్తున ఈ గొడ్డలి పార్టీ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టకపోతోంది. పైగా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ చెప్పుకొస్తున్నా నానాటికీ ఆ పేరే టీడీపీ జనంలో పెడుతూ చేస్తున్న రాజకీయానికి వైసీపీ ఏమీ చేయలేకపోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

అవును గొడ్డలి పార్టీయే :

దీంతో వైసీపీలో కీలక నేత సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాది గొడ్డలి పార్టీయే అని క్లెయిం చేసుకున్నారు. మా పార్టీ పరశురాముడు చేతిలో ఉన్న గొడ్డలి ఆ ఆయుధంతో సరి సాటి అని అన్నారు. అయితే అది ప్రజలను మోసం చేసే వారిని, అణచివేసే వారిని, అలాగే అరాచక శక్తులను ఎదుర్కొని పోరాడే పరశురాముని గొడ్డలి లాంటిది అని సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. అంటే వైసీపీని గొడ్డలి అంటే మేము అన్యాయాన్ని అణచివేసే గొడ్డలి లాంటి వారమని వైసీపీ కౌంటర్ ఇస్తోంది అన్న మాట. ఇక రాజ్యాంగ బద్దమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మరో రాజకీయ పార్టీ మీద చంద్రబాబు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సజ్జల చెప్పుకొచ్చారు.

జనాలే జడ్జి చేయాలి :

ఈ నేపధ్యంలో గొడ్డలి పార్టీ అంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో హత్య చేసి తమ మీదకు నెట్టాలని చూశారు అని చంద్రబాబు పదే పదే చెప్పుకొస్తున్నారు. ఆ విధంగా ఆయన గొడ్డలి పార్టీ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ పరశురాముడి చేతిలో ఉన్న గొడ్డలి తమదని వైసీపీ అంటోంది. మరి జనాల మదిలో గొడ్డలి అంటే ఏది రిజిస్టర్ అవుతుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ మీద టీడీపీ పీక్స్ లో ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కౌంటర్ స్టాటజీని రూపొందించే క్రమంలో వైసీపీ అవును గొడ్డలి పార్టీనే అని రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేయడం ఏ మేరకు హెల్ప్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే పరశురాముడి చేతిలో గొడ్డలి పార్టీ అని వైసీపీ చెప్పినా జనాలకు అది ఎంత మేరకు గుర్తు ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. గొడ్డలి పార్టీ అని టీడీపీ చేస్తున్న ప్రచారంలోకి తెలియకుండానే వైసీపీ ఇరుక్కుపోయి కార్నర్ అయితే మాత్రం సజ్జల చేస్తున్న కొత్త వాదన బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News