ఏఐ వాడొద్దు.. లేదంటే ఎగిరిపోతారు..

అయితే ఈ ఆంక్షలు విద్యార్థులను కట్టడి చేస్తాయా? ఏఐ వాడకుండా చేస్తాయా? భవిష్యత్తు తీర్చిదిద్దే సాంకేతికతల్లో వారికి ఏఐని వాడకుండా అడ్డుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది.;

Update: 2025-12-07 10:30 GMT

ఏఐ ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. సమాచార, సాంకేతిక రంగాల్లో విప్లవం సృష్టించిన ఈ కృత్రిమ మేధ నేడు అనేక రంగాల్లోనూ విస్తరిస్తోంది. అయితే దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. అన్నీ ఏఐతోనే చేస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీలు తమ రూటు మార్చుకున్నాయి.

ఇటీవల కాలంలో చాట్ జీపీటీ, జెమిని వంటి ఏఐ సాధనాలను ఉపయోగించకుండా పలు కంపెనీలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డేటా లీకేజీ అవుతుందనే భయమే కారణం. చాలా కంపెనీలు ఇప్పుడు తమ రహస్య సమాచారం ఏఐ మోడల్స్ లో నిక్షిప్తమై ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇచ్చే ఫ్రాంప్ట్ ల ద్వారా అది బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భద్రతా లోపాలను నివారించడానికి , వ్యాపార సంస్థలు కఠినమైన డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నాయి. తద్వారా ఉత్పాదకత, కొత్త ఆవిష్కరణలను మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పటికీ బహిరంగ ఏఐ వేదికలకు తమ ఉద్యోగుల అందుబాటులను పరిమితం చేస్తున్నాయి.

ప్రస్తుతం పాఠశాలలు, విద్యాలయాలు కూడా ఏఐ వినియోగంపై నియంత్రణను పెంచుతున్నాయి. విద్యార్తులు సమర్పించే అసైన్ మెంట్ లలో ఏఐ రూపొందించిన కంటెంట్ ను గుర్తించడానికి డిటెక్షన్ సిస్టమ్స్ ను కూడా ఉపయోగిస్తుండడం గమనార్హం. ఏఐని ఉపయోగించడం వల్ల విద్యార్థులలో ఆలోచించే శక్తి, విమర్శనాత్మక ఆలోచన శక్తి, సృజనాత్మకత తగ్గుతుందని.. ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చెందవని విద్యావేత్తలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

అయితే ఈ ఆంక్షలు విద్యార్థులను కట్టడి చేస్తాయా? ఏఐ వాడకుండా చేస్తాయా? భవిష్యత్తు తీర్చిదిద్దే సాంకేతికతల్లో వారికి ఏఐని వాడకుండా అడ్డుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది.

ఏఐపై పెరుగుతున్న ఈ పరిమితులు ఏఐ మోడల్స్, అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధకు మధ్య ఉన్న సంబంధాలపై ధీర్ఘకాలిక ప్రభావాలు చూపించే అవకాశాలు ఉన్నాయి. వినియోగాన్ని పరిమితం చేయడం వల్ల ప్రజలకు ఏఐపై పరిచయం తగ్గి దాని వినియోగంలో వైవిద్యం తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఏఐని పూర్తిగా నిషేధిస్తే కొన్ని ఆవిష్కరణలకు తోడ్పాటు తగ్గే ప్రమాదమూ ఉంది. ఇన్నోవేషన్, సమతుల్యత పాటించడం వల్ల దీన్నో గేమ్ చేంజర్ లా ఉపయోగించవచ్చు. భద్రతతోపాటు మానవ జ్ఞానవృద్ధికి ఏఐ మద్దతు ఇచ్చే విధంగా దానిని అభివృద్ధి చేస్తే అందరికీ మేలు జరుగుతుంది.

Tags:    

Similar News