తనకన్నా 27 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడితో కలిసి మహిళ దారుణం..
ఇక్కడ ఒక యువతి అత్తింటి సొమ్మును కొట్టేసేందుకు పెద్ద ప్రణాళిక వేసింది. ప్రయాగ్ రాజ్‌లో ఫూల్పూర్ లో ఈ ఘటన జరిగింది.;
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది నిజం అవుతందా.? అంటే అవుననే వినిపిస్తుంది. ఇప్పటికే చాలా విషయాలు నిజమయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఆడవారు సంఘాలు పెడతారన్నారు పెట్టారు.. హక్కుల కోసం పోరాడుతారన్నారు.. పోరాడారు.. ఇక పురుషులకు సమానంగా ఎదుగుతారన్నారు.. ఎదిగారు. ఆ సమానం అనేది అన్ని కోణాల్లో చూపిస్తున్నారు. నేరాలు చేయడంలో పురుషులతో సమానంగా కాదు.. పురుషుల కంటే ఒక అడుగు ముందకు వేశారని చెప్పవచ్చు.
పెరుగుతున్న అత్తింటిపై దాడులు, మోసాలు..
ఇటీవల కాలంలో ప్రియుడితో కలిసి మహిళలు భర్తను, అత్తింటి వారిని ఎలా హతమారుస్తు్న్నారో వింటూనే ఉన్నాం. ఇక ప్రియుడితో జంప్ అయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రియుడికి నగలు, నగదు ఇస్తున్న ఘటనలు లేకపోలేదు. ఇక్కడ ఒక యువతి అత్తింటి సొమ్మును కొట్టేసేందుకు పెద్ద ప్రణాళిక వేసింది. ప్రయాగ్ రాజ్‌లో ఫూల్పూర్ లో ఈ ఘటన జరిగింది. 47 ఏళ్ల అఫ్రీన్ తనకంటే చిన్న వయస్సున్న యువకుడిని ప్రియుడిగా ఎంచుకుంది. అతనితో కలిసి రూ.18 లక్షల దోపిడీ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన విచిత్రంగా అనిపించింది.
మహిళలు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు..?
సాధారణంగా నేర చరిత్రలో, మహిళల పాత్ర తక్కువగా ఉంటుంది. అయితే, అఫ్రీన్ కేసు మహిళలు కూడా మోసం, కుట్ర నేరాలకు పాల్పడగలరని నిరూపిస్తుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే మహిళలను ఎక్కువగా కుటుంబం, సమాజ పరిరక్షకులుగా ఉంటారు. అయితే, మహిళల రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత స్వాతంత్రం పెరుగుతున్నా కొద్ది మరో కోణంలో నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఏర్పడుతోంది.
వివాహేతర సంబంధంతోనే దోపిడీకి యత్నం..
అఫ్రీన్ తన భర్త లేని సమయంలో తన కంటే 27 సంవత్సరాల తక్కువ వయస్సున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో జంప్ అయ్యేందుకు నకిలీ దోపిడీ కుట్ర పన్నింది. అత్తగారింట్లో ఉన్న బంగారంను ప్రియుడికి ఇచ్చి బయటకు పంపంచింది. ఆ తర్వాత నగలు దొంగలింపబడ్డాయని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీ, ఫోరెన్సిక్, తదితర సంబంధిత అధికారులతో పరిశీలించారు. అసలు విషయం బయట పడింది. ఇది అఫ్రీన్ ఆడిన నాటకం అని తేల్చారు. ఆఫ్రీన్ తో పాటు ప్రియుడిని న్యాయ స్థానం ముందు నిలబెట్టారు.