తెరపై తెలుగు అందం.. ఎందుకు ఆ చిన్నచూపు..?
అసలు స్టార్ సినిమాల్లో తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోరు అనే డిస్కషన్ కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది.;
పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని సైతం షేక్ చేస్తున్న టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి అదే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావట్లేదు అన్న టాక్ ఒకటి వినిపిస్తుంది. తెలుగులో హీరోలు వచ్చినంతగా హీరోయిన్స్ రారు దానికి ఏవేవో రీజన్స్ చెబుతారు. ఐతే వచ్చిన ఒకరిద్దరికి కూడా పెద్దగా ఛాన్స్ లు ఇవ్వరు. అసలు స్టార్ సినిమాల్లో తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోరు అనే డిస్కషన్ కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది.
యువ దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిలతోనే సినిమాలు..
తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చేయాలంటే ఇస్తే కొత్త వాళ్లు ఇవ్వడమే తప్ప స్టార్ సినిమాలు అంత ఆసక్తి చూపించరు. అది ఎందుకు ఏమిటి అన్నది తెలియదు. ఐతే ఈమధ్య యువ దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిలతోనే సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ అయితే తను తీసే సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్ గా తీసుకుంటానని చెప్పాడు.
బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఇదివరకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేషనల్ వైడ్ గా మార్కెట్ ఉన్న భామలనే తెలుగులో స్టార్ సినిమాల్లో తీసుకుంటున్నారు. ఐతే అది మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలుస్తున్నా కూడా తెలుగులో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్న వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. మొన్నటిదాకా నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు జాన్వి కపూర్, రుక్మిణి వసంత్ ఇలా నార్త్ నుంచి వస్తేనో లేదా కన్నడ, మళయాళ పరిశ్రమ నుంచి వస్తేనో వాళ్లకు స్టార్ ఛాన్స్ లు ఇస్తున్నారే తప్ప తెలుగులో ఉన్న కథానాయికలకు సరైన గుర్తింపు రావట్లేదని చెప్పొచ్చు.
ఏ చిన్న అవకాశం వచ్చినా..
తెలుగులో వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి, ఆనంది, తేజశ్వి, అనన్యా నాగళ్ల ఇలా టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు. ఐతే ఎలాగు కెరీర్ సినిమాలనే ఫిక్స్ అయ్యాం కాబట్టి స్టార్ ఛాన్స్ లు కాకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా వీళ్లు చేస్తూ వస్తున్నారు. ఐతే తెలుగులో ఈమధ్య ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ లో రుక్మిణి వసంత్ ఒకరు. సప్త సాగరాలు దాటితో సక్సెస్ అందుకుని కాంతారా చాప్టర్ 1 తో మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ గా ఉంది.
తెలుగులో ఎన్ టీ ఆర్ తో ఆల్రెడీ సినిమా చేస్తున్న రుక్మిణి నెక్స్ట్ టాలీవుడ్ స్టార్స్ తో వరుస సినిమాలు చేసేలా ఉంది. జాన్వి కపూర్ కూడా తారక్ తో దేవర చేసిన తర్వాత చరణ్ తో పెద్ది సినిమా చేస్తుంది. వీరితో పాటు మిగతా హీరోయిన్స్ కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు.
తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు స్టార్స్ గా రాణించాలనే కోరిక ఉన్నా కొంతమంది మాత్రం ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేస్తారు. మరికొంతమంది కొన్ని లిమిటేషన్స్ వల్ల కొన్ని పరిమితమైన రోల్స్ కే ఫిక్స్ అవుతారు. అందుకే ముంబై మోడల్స్, హిందీ నాయికలు, కన్నడ భామలు, మలయాళ ముద్దుగుమ్మలకు తెలుగులో పెద్ద పెద్ద ఛాన్స్ లు వస్తున్నాయి.