'ఇరుముడి' సక్సెస్ ఫార్ములా అదే..!
మధ్యలో భార్య భర్తల రొమాన్స్ లేదంటే హీరో గారు ఒక ఐటెం సాంగ్ వేసుకుని ఉంటే కచ్చితంగా పాయింట్ డైవర్స్ అయ్యేది.
రవితేజతో పాటు ఆయన అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఎట్టకేలకు నమోదు అయింది. ఆ మధ్య అంతంత మాత్రంగా ఆడిన ధమాకా సినిమాను సూపర్ హిట్ అనుకుంటున్న రవితేజ అభిమానులకు అంతకు మించి అన్నట్లుగా దర్శకుడు శివ నిర్వాణ 'ఇరుముడి' సినిమాను ఇచ్చాడు. సాధారణంగానే తెలుగు ప్రేక్షకులు సెంటిమెంట్‌కి పట్టం కడతారు, అలాంటిది ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్, భక్తి సెంటిమెంట్, పిల్లల సెంటిమెంట్ ఉండటంతో ఇరుముడి సినిమాకు ఓ రేంజ్ ఓపెనింగ్ దక్కింది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అని సెంటిమెంట్ సినిమాలు, ఎమోషన్ కలిగించే సినిమాలు వచ్చాయి. కానీ అవి ఓవర్ డోస్ ఎమోషన్ కారణంగా విఫలం అయ్యాయి. ఇరుముడి సినిమాలో అన్నీ సమపాల్లలో సరిపోవడం వల్లే ఈ విజయం దక్కిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విశ్వనాథ్ అండ్ సన్స్...
సోషల్ మీడియాలో ఇరుముడికి దక్కిన విజయం గురించి ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ మొదలుకుని 'పెద్ది' సినిమా వరకు చాలా సినిమాలతో ఇరుముడి సినిమాను పోల్చుతూ పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఇరుముడి సినిమాకు వచ్చిన పాజిటివ్ స్పందన ఇతర సెంటిమెంట్ సినిమాలకు రాకపోవడం వెనుక కారణం ఏంటా అని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సినిమాలోనూ ఎమోషన్ సీన్స్ అద్భుతంగా పండించారు. రామ్ చరణ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్లైమాక్స్ ట్విస్ట్‌తో సినిమా స్థాయి అమాంతం పెరుగుతుంది. కానీ దర్శకుడు బుచ్చిబాబు అక్కడ అక్కడ సైట్ ట్రాక్ అయ్యాడు. ముఖ్యంగా హీరోయిన్ సీన్స్ విషయంలో గాడి తప్పినట్లుగా అయింది. అందుకే పెద్ది సినిమా విషయంలో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు.
రవితేజ ఇరుముడి సినిమాతో...
ఇరుముడి సినిమాలో తండ్రి, కూతురు సెంటిమెంట్‌ను మెయిన్ స్ట్రీమ్‌గా నడిపించాడు. మధ్యలో భార్య భర్తల రొమాన్స్ లేదంటే హీరో గారు ఒక ఐటెం సాంగ్ వేసుకుని ఉంటే కచ్చితంగా పాయింట్ డైవర్స్ అయ్యేది. అలాంటి సైడ్ ట్రాక్‌లు తీసుకోకుండా దర్శకుడు శివ నిర్వాన కథ లైన్‌లోనే నడిచాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో రోత పనులు చేయలేదు. దాంతో సినిమాలోని సెంటిమెంట్ పై ప్రేక్షకులు సాగుతూ వచ్చారు. అదే ఫీల్ ను కొనసాగిస్తూ చివరి వరకు వస్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న కామెడీ బిట్స్ కూడా లేకుండా, ఎలాంటి హడావిడి, కమర్షియల్ పాటలు లేకుండా పాయింట్ పై నడిపించాడు. మల్లెపూల పల్లకి పాట తర్వాత పూర్తిగా కథలోనే సినిమా సాగింది. అందుకే సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. మధ్యలో ఎక్కడ కూడా డిస్ కనెక్ట్ కాలేదు. అందుకే బయటకు వచ్చేప్పుడు మంచి ఫీల్‌తో వస్తున్నారు.
ఇరుముడి క్లైమాక్స్ సీన్స్...
రవితేజ అనగానే కమర్షియల్ హీరో, ఆయనకు కొన్ని కమర్షియల్ సీన్స్ ఉండాలి, అలాగే యాంటీ క్లైమాక్స్ ఉండకూడదు అని దర్శకుడు శివ నిర్వాణ అనుకోలేదు. యాంటీ క్లైమాక్స్ ఉన్నప్పటికీ చివర్లో చిన్న మెరుపు వంటిది ఇవ్వడం ద్వారా ప్రేక్షకులు మరీ డిస్సపాయింట్ కాకుండా బయటకు వస్తారు. మొత్తానికి ఇరుముడి సినిమాతో దర్శకుడు శివ నిర్వాన చాలా మంది సెంటిమెంట్ సినిమాలను తీశాం అని చెప్పుకునే దర్శకులకు గట్టి సమాధానం ఇచ్చినట్లు అయింది. రవితేజ ఇరుముడి సినిమా ను ఒప్పుకోవడంతో పాటు, తన ఇమేజ్‌ను పక్కన పెట్టడం వల్లే ఈ అద్భుతంగా జరిగింది అనడంలో సందేహం లేదు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎక్కడా ఓవర్ కాకుండా పాత్రకు అనుకూలంగా నటిస్తూ మెప్పించారు. సెంటిమెంట్‌తో గుండెలు పిండేయాలి అనుకున్నప్పుడు అదే చేయాలి, రొమాంటిక్, కామెడీ సీన్స్ చేయకూడదు అని ఇరుముడు చెప్పకనే చెప్పింది. ఇదే ఇరుముడి సక్సెస్ ఫార్ములా అని కూడా అనుకోవచ్చు.