నిత్యా మీనన్.. అక్కడ సినిమాలే ఎందుకు..?
సౌత్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. ఆమె సినిమా సెలెక్ట్ చేసింది అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క.;
సౌత్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. ఆమె సినిమా సెలెక్ట్ చేసింది అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క. తెలుగులో స్టార్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న నిత్యా మీనన్ ఎందుకో ఇక్కడ కెరీర్ కొనసాగించలేకపోయింది. నిత్యా తో మంచి లవ్ స్టోరీస్ తీసిన వాళ్లు ఇప్పుడు మన దగ్గర ఆమెకు తగిన పాత్రలు ఇవ్వట్లేదు. మహానటి కోసం నాగ్ అశ్విన్ ముందు ఆప్షన్ నిత్యానే అయినా కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్..
ఐతే తెలుగు మేకర్స్ నిత్యాని కన్విన్స్ చేసే కథలు రాయట్లేదు. 2022 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా చేసింది నిత్యా మీనన్. ఆ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసింది అమ్మడు. ఐతే తెలుగు మేకర్స్ పట్టించుకోకపోయినా కోలీవుడ్ లో మాత్రం నిత్యా మీనన్ అదరగొట్టేస్తుంది. అమ్మడు అక్కడ వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
కోలీవుడ్ లో ఈమధ్యనే తలైవన్ తలైవి సినిమాతో మరో సక్సెస్ అందుకుంది నిత్యా మీనన్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా భార్య భర్తల మధ్య పెళ్లైన కొత్తలో ఆ తర్వాత వచ్చే గొడవల నేపథ్యంతో ఈ సినిమా వచ్చింది. పాండిరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నిత్యా మీనన్ తన సహజ నటనతో ఆకట్టుకుంది.
నిత్యా మీనన్ తెలుగు ఫ్యాన్స్ ..
తెలుగులో నిత్యాకు నచ్చే సినిమాలు రావట్లేదా లేదా ఆమే కావాలని గ్యాప్ తీసుకుంటుందా అన్నది తెలియదు కానీ నిత్యా మీనన్ తెలుగు ఫ్యాన్స్ ఆమెను చాలా మిస్ అవుతున్నారు. తలైవన్ తలైవి సినిమా తెలుగులో సార్ మేడం అంటూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నారు. టాలీవుడ్ నిత్యా మీనన్ ని దూరం చేసుకుంటుంది. ఆమెకు తగిన పాత్రలు రాస్తే.. నిత్యా తెలుగు సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీ అంటుంది.
నిత్యా మీనన్ ప్రస్తుతం ధనుష్ తో ఇడ్లీ కొడై సినిమా చేస్తుంది. ఇదే కాకుండా కాదలిక్క నెరుమల్లై సినిమా కూడా చేస్తుంది నిత్యా మీనన్. కోలీవుడ్ లో తన ఫాం కొనసాగిస్తున్న నిత్యాని తెలుగు సినిమాల్లో కూడా చూడాలని కోరుతున్నారు ఆడియన్స్. కథ నచ్చాలే కానీ నిత్యా కచ్చితంగా ఏ భాషలో అయినా సినిమాలు చేస్తుంది. నిత్యా కి పాపులారిటీ తెచ్చిన టాలీవుడ్ మీద ఆమెకు కూడా చాలా రెస్పెక్ట్ ఉంది.