• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కార్తీ జపాన్ ఎంతవరకు...

కార్తీ జపాన్ ఎంతవరకు వచ్చిందంటే..

| కాగా, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, మూవీ టీమ్ ఓ సరి కొత్త వీడియో విడుదల చేశారు.

By - Tupaki Desk
Update: 2023-09-13 18:02 GMT

తమిళ హీరో కార్తికి అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. తన అన్న సూర్య అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా, సూర్య కంటే ఎక్కువ మార్కెట్ లో తెలుగులో కార్తీ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు. ఇక, తెలుగులో డబ్బింగ్ సైతం ఆయనే చెప్పుకుంటారు. అందుకే, ఆయనను ఇక్కడి ప్రేక్షకులు కూడా తమ ఓన్ చేసుకున్నారు.

కాగా, ఆయన హీరోగా నటిస్తన్న తాజా చిత్రం జపాన్. ప్రతి సినిమాకీ ఏంతో కొంత వేరియేషన్ చూపించడంలో ఆయన ముందుంటారు. ఈ సారి డిఫరెంట్ గా జపాన్ అనే మూవీతో వస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. రాజా మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 దీపావళి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

కాగా, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, మూవీ టీమ్ ఓ సరి కొత్త వీడియో విడుదల చేశారు. అందులో కార్తి డబ్బింగ్ చెబుతున్నారు. డబ్బింగ్ పనులు మొదలుపెట్టారనే సింబాలిక్ గా ఈ వీడియో విడుదల చేశారు. అయితే, వీడియో లో మాత్రం ఆయన డబ్బింగ్ చెబుతుంటే, డైరెక్టర్ కి నచ్చక వన్ మోర్ అంటూ చాలా సార్లు చెప్పించడం విశేషం.

ఇక, ఈ సినిమాలో సునీల్, నవనీత్, ఆశా సుధీర్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో కార్తి సరసన అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఓ దొంగ బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని చెన్నైలోని ప్రముఖ లలితా జ్యువెలరీలో తిరువారూర్ ముర్గన్ 13 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలను దోచుకున్న సంఘటన గుర్తుండే ఉంటుంది.

ఈ దోపిడీ 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు పోలీసులు దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లో కూడా దోపిడీలకు పాల్పడిన మురుగన్‌ను అరెస్టు చేశారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఆయన కథతోనే ఈ సినిమా తీశారని, అయితే, హీరో ఎలివేషన్స్ ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి, ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • Japanmovie 
  • Karthi 
  • Anuemmanuel 
  • Sunil 
  • Gvprakash 
  • Trailer 
  • Rajumurugan 
  • Dubbing 

Similar News

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

Copyright @2026

Powered by Blink CMS