బాస్ సినిమా.. ఇంకా ఆ ప్రాబ్లమ్ సెట్టవ్వలేదా?

ఇక బడా స్టార్ల సినిమాలైతే ప్రొడక్షన్ పనులు పూర్తి కాక ముందే డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ హక్కులు అమ్ముడవుతాయి.;

Update: 2025-08-01 23:30 GMT

ఏ సినిమానైనా ప్రొడక్షన్ పూర్తికాకముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక బడా స్టార్ల సినిమాలైతే ప్రొడక్షన్ పనులు పూర్తి కాక ముందే డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ హక్కులు అమ్ముడవుతాయి. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాలకూ ఇదే తంతు జరుగుతోంది. కానీ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభరకు ఓటీటీ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది.

తన సినిమాకు ముందే ఓటీటీ అగ్రిమెంట్ పూర్తయ్యేలా చూసుకునే చిరుకు విశ్వంభర విషయంలో డిఫరెంట్ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సినిమా ఓటీటీ అగ్రిమెంట్ చేసుకునేందుకు ఏ ఓటీటీ సంస్థ కూడా పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

దీన్నంతటికీ కారణం టీజరేనని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై బజ్ పెంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ చెబుకున్న రేటుకు ఓటీటీలు అడుగుతున్న రేటుకు పొంతన లేదని అంటున్నారు. అసలు వాళ్లు చెప్పిన రేటుకు దగ్గరలోకి కూడా రాలేదని విశ్వంభ‌ర పెండింగ్ లో ఉందని చెప్తున్నారు.

మేకర్స్ ఓటీటీ డీల్ క్లోజింగ్ కు రూ.75 కోట్లు అడుగుతున్నారని టాక్. అయితే ఓటీటీ సంస్థ‌లు రూ.40 కోట్లు కూడా వెచ్చించేందుకు సిద్ధంగా లేవని సమాచారం. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ పరిస్థితిలో మార్పు ఉంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ట్రైలర్ తో సినిమారై బజ్ క్రేయేట్ అవుతుందని.. అప్పుడు ఓటీటీలతో మళ్లీ బేరాలు ఉంటాయని ఆశిస్తున్నారు.

అప్పుడు ఔట్ పుట్ చూసి ఓటీటీ సంస్థలు కచ్చితంగా తాము చెప్పిన రేటుకే డిజిటల్ రైట్స్ కొంటాయని ధీమాగా ఉన్నారు. అందుకే ఈ ట్రైలర్ పై మూవీటీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందట. మొత్తం మూడు ట్రైలర్లను కట్ చేసి చిరంజీవికి చూపించారట. అందులోంచి ఆయనే ఒకటి ఫైనలైజ్ చేశారని టాక్. మరోవైపు విశ్వంభర హిందీ రైట్స్ రూ.38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

కాగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు. భారీ విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తీర్చి దిద్దారు. త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Tags:    

Similar News