ఆ సీక్వెల్ కి ఇంకా వెయిటింగ్ తప్పదా..?
యూత్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు కొన్ని ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి.;

యూత్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు కొన్ని ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కవ్విస్తూ వచ్చిన కొన్ని సినిమాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో స్టార్స్ లేకపోయినా సరే ఒక స్టార్ సినిమాకు ఉన్న క్రేజ్ ఉంటుంది. అలాంటి ఒక సూపర్ హిట్ సినిమానే ఈ నగరానికి ఏమైంది. యువత మెచ్చే సినిమాల లిస్ట్ లో టాప్ 5 కాదు కాదు టాప్ 3 ఇది ఉంటుందంటే నమ్మాల్సిందే.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం లాంటి వారు నటించారు. 2018 లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కాగా ఈమధ్యనే రీ రిలీజై మళ్లీ మంచి వసూళ్లను రాబట్టింది. ఐతే ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఉందని చెప్పాడు.
ఐతే డైరెక్టర్ గా సినిమాలు మానేసి యాక్టర్ గా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్. అందుకే అతను ఈమధ్య రెగ్యులర్ సినిమాలు చేయలేకపోతున్నాడు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో చివరగా కీడా కోలా వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే కీడా కోలా లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ అతని యాక్టింగ్ ఫ్యాన్స్ కి నచ్చాయి.
ఇక మళ్లీ అతను యాక్టర్ గా చేస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది 2 చేస్తానని చెప్పినా దానికి ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడు. ఐతే ఆ సీక్వెల్ ఎప్పుడు వచ్చినా కూడా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఈ నగరానికి ఎమైంది 2 తీసినా అందులో విశ్వక్ సేన్ నటిస్తాడా అన్న డౌట్ ఉంది. ఎందుకంటే మాస్ కా దాస్ ఇప్పుడు మంచి మాస్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్నాడు. సో ఈ.ఎన్.ఈ 2 వచ్చినా కూడా విశ్వక్ చేస్తాడని చెప్పడం కష్టం. అయినా కూడా అక్కడ ఉంది తరుణ్ భాస్కర్ కాబట్టి తప్పకుండా సినిమా వేరే లెవెల్ అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు.
మరి ఈ నగరానికి ఎమైంది 2 ఎప్పుడు వస్తుంది. దానితో పాటు తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ఏయే సినిమాలు చేస్తాడన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.