నా మనవళ్లు పెద్దవాళ్లైనా నాగ్ ఇంతే ఉంటారు
అయితే ఇప్పుడు నాగార్జున అందం గురించి మరో భాషకు చెందిన నటుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.;
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండాలంటే దానికెంతో సాధన అవసరం. రెగ్యులర్ గా వర్కవుట్స్ నుంచి డైట్ మెయిన్‌టెయినెన్స్ వరకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇష్టమైన ఫుడ్ ను తినలేరు, ఇష్టమైన చోటుకు ప్రశాంతంగా వెళ్లలేరు. అందుకే సెలబ్రిటీగా ఉండాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందని ఇండస్ట్రీలో ఉండేవారంతా అంటుంటారు.
ఆరు పదుల వయసులోనూ యంగ్ గా..
అలా అన్నీ రూల్స్ ఫాలో అవుతూ ఉండటం వల్లే ఎంతోమంది నటులు ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ, సిద్ధార్థ్, నాగార్జున వీళ్లంతా ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇంచు మించు అలానే ఉన్నారు. అక్కినేని అందగాడు నాగార్జున ఆరు పదుల వయసులో కూడా ఇంకా చాలా యంగ్ గా ఉన్నారని కేవలం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా అన్ని భాషల వాళ్లూ మాట్లాడుకుంటారనే సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు నాగార్జున అందం గురించి మరో భాషకు చెందిన నటుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సౌత్ అన్‌బాండ్ అనే పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించగా, ఆ ఈవెంట్ లో సౌత్ హీరోలు కమల్ హాసన్, మోహన్ లాల్, నాగార్జున, విజయ్ సేతుపతి పాల్గొని సందడి చేశారు.
నాగ్ పై యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేయాలి
ఆ ఈవెంట్ లో సేతుపతి మాట్లాడుతూ, నాగార్జున గారు జెంటిల్ మ్యాన్ అని, తన చిన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అంతే ఉన్నారని, ఆయనకు వయసెందుకు పెరగట్లేదో తనకు తెలియడం లేదని, యాంటీ ఏజింగ్ పై రీసెర్చ్ చేసేవాళ్లు ఆయన్ని తీసుకెళ్లి కొన్నాళ్ల పాటూ టెస్ట్ లు చేయాలని, అప్పట్నుంచి ఇప్పటివరకు ఆయన హెయిర్ కూడా అంతే ఉందని, ఏమీ మారలేదని, తన మనవళ్లు పెద్దవాళ్లైనా నాగార్జున మాత్రం ఇంతే ఉంటారని చెప్పగా, నాగ్ ఆ కామెంట్స్ కు ఏ మాత్రం పొంగిపోకుండా ఎంతో హుందాగా చిన్న నవ్వు నవ్వి ఊరుకోవడం అక్కడి అందరి దృష్టిని ఆకర్షించింది.