ఆయ‌న వ‌ల్లే ఈ స్థాయిలో ఉన్నా.. జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా

అన్ని భాష‌ల్లో ఒకే త‌ర‌హా క్రేజ్ తెచ్చుకునే న‌టులు చాలా రేర్ గా ఉంటారు. ఈ కాలంలో అలాంటి న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి కూడా ఒక‌రు.;

Update: 2025-05-19 16:30 GMT
ఆయ‌న వ‌ల్లే ఈ స్థాయిలో ఉన్నా.. జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా

అన్ని భాష‌ల్లో ఒకే త‌ర‌హా క్రేజ్ తెచ్చుకునే న‌టులు చాలా రేర్ గా ఉంటారు. ఈ కాలంలో అలాంటి న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి కూడా ఒక‌రు. ఉప్పెన, సైరా సినిమాల‌తో తెలుగు వారికి బాగా సుప‌రిచితుడైన విజ‌య్ సేతుప‌తి కోలీవుడ్ లో స్టార్ యాక్ట‌ర్ గా త‌న‌కంటూ మంచి క్రేజ్, ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మై మంచి విల‌న్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న విజ‌య్ సేతుప‌తి రీసెంట్ గానే టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. పూరీ చెప్పిన క‌థ త‌న‌నెంతో ఇంప్రెస్ చేసింద‌ని ఎప్పుడెప్ప‌డు ఆ క‌థ‌లో న‌టిస్తానా అని ఎదురుచూస్తున్న‌ట్టు సేతుప‌తి ఇప్ప‌టికే చెప్పాడు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సేతుప‌తి, రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఏస్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మే 23న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ సేతుప‌తి చాలా యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా గురించి మ‌రియు ప‌లు ఇంట్రెస్టింగ్ అంశాల గురించి చెప్తున్నాడు.

న‌టుడిగా తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం డైరెక్ట‌ర్ ఆర్ముగ కుమారేన‌ని సేతుప‌తి వెల్లడించాడు. సినీ అవ‌కాశాల కోసం తిరుగుతున్న‌ప్పుడు వ‌ర్ణం అనే మూవీ ఆడిష‌న్ కు వెళ్లి అక్క‌డున్న మేనేజ‌ర్ భూప‌తి సాయంతో ఫోటోల‌ను నిర్మాత‌ల‌కు ఇచ్చాన‌ని, వాళ్లు త‌న‌ను పిలిచి సీన్ గురించి చెప్పి త‌న‌నే డైలాగ్స్ రాసుకుని యాక్ట్ చేయ‌మన్నార‌ని, అప్ప‌టివ‌ర‌కు డైలాగ్స్ రాయ‌గ‌ల‌న‌నే విష‌యం త‌న‌క్కూడా తెలియ‌ద‌ని సేతుప‌తి వెల్ల‌డించాడు.

ఆ సినిమాకు డైరెక్ట‌ర్ ఆర్ముగ కుమారే. త‌న‌ను తీసుకోవాలా వ‌ద్దా అని నిర్మాత‌లు అనుకుంటున్న టైమ్ లో ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు. త‌ప్ప‌కుండా తీసుకోమ‌ని త‌న‌ను రిక‌మండ్ చేశాడ‌ని, అలా త‌న‌కు మొద‌టి ఛాన్స్ ఆర్ముగ కుమార్ వ‌ల్లే వ‌చ్చింద‌ని, త‌ర్వాత న‌డువుల కొంజం ప‌క్కా క‌నోమ్ సినిమాకు కూడా త‌న‌ను తీసుకోమ‌ని ఆయ‌నే సిఫార్సు చేశార‌ని చెప్పాడు. కెరీర్ లో సెటిల్ అయి ఒక స్థాయి వ‌చ్చాక ఎవ‌రైనా మ‌న‌కు హెల్ప్ చేస్తారు కానీ మ‌నమెవ‌రో తెలియ‌న‌ప్పుడు కూడా సాయం చేయ‌డం చాలా గొప్ప విష‌యమ‌ని, ఆ సాయం చీక‌టిలో నిండిన ఇంటిలో దీపం వెలిగించ‌డం లాంటిద‌ని, ఆర్ముగ కుమార్ ఆ రోజు అలాంటి దీపాన్ని త‌న జీవితంలో వెలిగించ‌డం వ‌ల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాన‌ని, ఈ విష‌యంలో ఆయ‌న‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని విజ‌య్ సేతుప‌తి తెలిపాడు.

Tags:    

Similar News