విజయ్ దేవరకొండకు అసలైన టర్నింగ్ పాయింట్ ఇదేనా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి స‌క్సెస్‌ల‌తో యూత్ లో స్పెష‌ల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ఆశించిన స్థాయి బాక్సాఫీస్ స‌క్సెస్ ను అందుకోలేకపోయాడు.

Update: 2026-07-19 17:30 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి స‌క్సెస్‌ల‌తో యూత్ లో స్పెష‌ల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ఆశించిన స్థాయి బాక్సాఫీస్ స‌క్సెస్ ను అందుకోలేకపోయాడు. స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోయినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం మరోసారి భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూపొందుతున్న రౌడీ జనార్దన్ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు కంబ్యాక్‌గా నిలుస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లోనూ వినిపిస్తోంది.

సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కెరీర్‌ను ఒక్క సినిమా పూర్తిగా మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరైన కథ, స్ట్రాంగ్ ప్రెజెంటేషన్, ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కమర్షియల్ అంశాలు కలిస్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే పలువురు హీరోలు నిరూపించారు. ఇప్పుడు విజయ్ కూడా అలాంటి ట‌ర్న్ కోస‌మే ఎదురుచూస్తున్నార‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రౌడీ జనార్దన్ తర్వాత విజయ్ దేవరకొండ లైనప్ కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. విభిన్న డైరెక్ట‌ర్ల‌తో డిస్క‌ష‌న్స్ జ‌రుపుతున్న‌ట్టు ప్రచారం సాగుతుండగా, ఒకే తరహా కథలకే పరిమితం కాకుండా కొత్త జానర్లను కూడా పరిశీలిస్తున్నార‌ని సినీ వర్గాలు చెబుతున్నాయి. కెరీర్‌ను దీర్ఘకాలికంగా ప్లాన్ చేసుకునే దిశగా స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు పాన్ ఇండియా మార్కెట్‌పై కూడా విజయ్ ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డితో త‌న మార్కెట్ ను బాగా పెంచుకున్న విజ‌య్, ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారని స‌మాచారం. సౌత్ మార్కెట్ తో పాటు హిందీ బెల్ట్‌లో కూడా తన మార్కెట్‌ను బలోపేతం చేయాలనే స్ట్రాట‌జీతో ముందుకు సాగుతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పోటీ కూడా గతంతో పోలిస్తే మరింత పెరిగింది. ప్రతి స్టార్ హీరో భారీ స్థాయి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరిస్థితుల్లో విజయ్ దేవరకొండకు కూడా ఒక స్ట్రాంగ్ స‌క్సెస్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి టైమ్ లో రౌడీ జనార్దన్ రిజ‌ల్ట్ ఆయన తదుపరి ప్రాజెక్టుల మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఆడియ‌న్స్ ను మెప్పించగలిగితేనే విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త చాప్ట‌ర్ మొద‌ల‌వుతుంద‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ సినిమాను ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండ‌స్ట్రీ కూడా ప్రత్యేకంగా గమనిస్తోంది. మ‌రి ఇలాంటి పరిస్థితుల్లోరౌడీ జనార్దన్ విజయ్‌కు మరో సాధారణ సినిమా అవుతుందా, లేక కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే అసలైన కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందా అన్నది రిలీజ్‌ తర్వాతే క్లారిటీ రానుంది.

Tags:    

Similar News