వెంకీ ఇంట విషాదం
టాలీవుడ్ విక్టరీ వెంకటేశ్ పర్సనల్ లైఫ్ ను చాలా ప్రైవేసిగాని ఉంచడానికి ఇష్టపడతారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే వెంకీ ఎల్లప్పుడూ పాజిటివ్ గానే కనిపిస్తారు.;
టాలీవుడ్ విక్టరీ వెంకటేశ్ పర్సనల్ లైఫ్ ను చాలా ప్రైవేసిగాని ఉంచడానికి ఇష్టపడతారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే వెంకీ ఎల్లప్పుడూ పాజిటివ్ గానే కనిపిస్తారు. అయితే రీసెంట్ గా తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయనకు 12 ఏళ్లుగా తోడుగా ఉన్న జర్మన్ షెపర్డ్ పెంపుడు కుక్క "గూగుల్" మృతి చెందింది.
వెంకీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలు షేర్ చేస్తూ, “నా ప్రియమైన గూగుల్ . గత 12 ఏళ్లుగా నువ్వు మా జీవితాలను ప్రేమతో, అందమైన జ్ఞాపకాలతో నింపావు. నువ్వే మా సూర్యకాంతివి. నేడు నీకు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. నీ వెళ్ళిపోవడం వలన ఏర్పడిన ఖాళీ మాటల్లో చెప్పలేనిది. ఎప్పటికీ నిన్ను మిస్ అవుతాను నా ప్రియమైన స్నేహితుడా” అంటూ ఎమోషనల్ గా రాశారు.
ఫోటోల్లో వెంకీ గూగుల్‌తో ఉన్న ఆత్మీయ క్షణాలను పంచుకున్నారు. ఒక ఫోటోలో వెంకీ స్మైల్ తో కుక్క పక్కన కూర్చుని ఉంటే, మరో ఫోటోలో గార్డెన్‌లో గూగుల్ తలను తాకుతూ స్నేహపూర్వకంగా కనిపించారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
వెంకీ పోస్ట్‌పై అభిమానులు, సినీ ప్రముఖులు స్పందిస్తూ, ఇది నిజంగా బాధాకరం.. గూగుల్ మీకు ఎంత ప్రియమైనదో మాకు తెలుసు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెంపుడు జంతువులపై వెంకటేశ్ కి ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. తరచూ తన కుక్కలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకునే ఆయన, ఇప్పుడు గూగుల్‌ని కోల్పోవడం చాలా బాధగా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, వెంకటేశ్ త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక క్రేజ్ ఉండటంతో, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.