వెన్నెల కిషోర్ అసలు టార్గెట్ అదేనట!
తానొకటి తలస్తే దైవం మరోటి తలచిందన్నట్టు ఇండస్ట్రీలోకి ఏదో అవాలని వస్తే మరేదో అవుతూ ఉంటారు.;
తానొకటి తలస్తే దైవం మరోటి తలచిందన్నట్టు ఇండస్ట్రీలోకి ఏదో అవాలని వస్తే మరేదో అవుతూ ఉంటారు. డైరెక్టర్ అవాలనుకుంటే యాక్టర్ అవడం, యాక్టర్లు డైరెక్టర్లు అవడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ క్రేజీ కమెడియన్ గా పేరొందిన వెన్నెల కిషోర్ ముందు డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు.
కమెడియన్ గా బిజీబిజీ
గత కొన్నేళ్లుగా వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్ గా ఉన్న విషయం తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తో పాటూ బాడీ లాంగ్వేజ్ తో కూడా వెన్నెల కిషోర్ ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కమెడియన్స్ లో కిషోర్ పేరు కూడా నిలిచిపోతుందని చాలా కచ్ఛితంగా చెప్పొచ్చు. ఇప్పుడు బెస్ట్ కమెడియన్ గా రాణిస్తున్న వెన్నెల కిషోర్ ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని కాదట.
కిషోర్ టార్గెట్ తాను డైరెక్టర్ అయి, మంచి సినిమాలు తీసి, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం. కానీ అనుకోకుండా కమెడియన్ గా అవతారమెత్తి, డైరెక్షన్ వైపు వెళ్లలేనంత బిజీ అయిపోయారు. వెన్నెల సినిమాలో కిషోర్ చేసిన ఖాదర్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి. ఖాదర్ క్యారెక్టర్ ను అనుకోకుండా కిషోర్ చేశారని రీసెంట్ గా డైరెక్టర్ దేవా కట్టా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వెన్నెల సినిమాలోకి అలా ఎంట్రీ..
కిషోర్, దేవా కట్టా ఫ్రెండ్స్. వెన్నెల సినిమాకు అసిస్టెంట్ గా వర్క్ చేసి మేకింగ్ లో హెల్ప్ చేయడానికి కిషోర్ ముందుగా ప్రాజెక్టులోకి ఎంటరయ్యారని, డైరెక్టర్ అయి, పవన్ తో సినిమా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న కిషోర్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కోసం మాత్రమే ఆ సినిమాకు పని చేశాడని, చిన్న బడ్జెట్ సినిమా కావడంతో ఫ్రీ గా వర్క్ చేసే వాళ్లు అవసరం అనే ఆలోచనతో దేవా కట్టా కూడా కిషోర్ ను తీసుకున్నారట.
వెన్నెల సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీసా సమస్య వల్ల ఖాదర్ క్యారెక్టర్ చేయాల్సిన శివారెడ్డి రాలేకపోవడంతో ఆ పాత్రను కిషోర్ తో చేయించామని, ముందు సినిమాలో నటించడానికి కిషోర్ ఒప్పుకోలేదని, తన టార్గెట్ డైరెక్షనే అని చెప్పాడని, ఈ సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుందని చెప్పి కిషొర్ తో ఈ పాత్ర చేయించినట్టు దేవా కట్టా తెలిపారు. అలా డైరెక్టర్ అవాలనుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన కిషోర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటూ కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు.