దీపావళికి ఐనా ఆ ఫ్యామిలీ సందడి ఉండేనా?

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా కోసం అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు.

Update: 2026-10-16 03:53 GMT

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా కోసం అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా వీరి కాంబోలో 'ఆదర్శ కుటుంబం' సినిమా రూపొందింది, విడుదల కూడా అన్నారు, ప్రమోషన్‌ చేశారు. తీరా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కాలేదని విడుదల వాయిదా వేయడం జరిగింది. సినిమా ప్రమోషన్స్‌ కూడా పూర్తి అయిన తర్వాత విడుదల వాయిదా వేయడం ను చాలా మంది తీవ్రంగా తప్పుబట్టారు. అయినా కూడా చేసేది ఏం లేదని, తమ చేతిలో లేకుండా పోయిందని నిర్మాత నాగవంశీ చేతులు ఎత్తేసిన విషయం తెల్సిందే. దసరా కానుకగా ఆదర్శ కుటుంబం సినిమా వచ్చి ఉంటే తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అనేది బాక్సాఫీస్‌ వర్గాల అంచనా. పండుగ సీజన్ ను మిస్‌ చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాతో...

ఆదర్శ కుటుంబం సినిమాను నిర్మించిన నాగవంశీ 'జైలర్‌ 2' సినిమాను డబ్‌ చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు. సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద దసరా సందడి కనిపిస్తోంది. ఇదే సమయంలో నాగవంశీ తన ఆదర్శ కుటుంబం సినిమా గురించి కూడా ఆలోచించాలని వెంకటేష్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా విడుదల వాయిదా ప్రకటన చేసిన సమయంలో నాగవంశీ మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు సినిమాను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నాడు. వెంకటేష్ ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్నారు, ఆయన వచ్చిన వెంటనే డేట్లు పరిశీలించి, తప్పకుండా ఒక మంచి డేట్‌ కు విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు డేట్‌ విషయంలో నాగవంశీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాత నాగవంశీ జైలర్‌ 2...

ఒక వైపు దసరా కానుకగా వచ్చిన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తూ ఉంటే, ఆదర్శ కుటుంబం ఈ అవకాశం ను కోల్పోయింది అంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అంటూ చాలా మంది రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. సాదా సీదా చిన్న సినిమా తరహాలోనే వాయిదా వేయడం విడ్డూరంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు త్రివిక్రమ్‌, వరుస విజయాలతో దూసుకు పోతున్న వెంకటేష్ కాంబో, పైగా సుదీర్ఘ కాలంగా ఈ కాంబో కోసం వెయిట్‌ చేస్తున్నారు, అలాంటి మూవీని మరీ ఇంత కేర్‌లెస్‌గా ఎలా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో నిర్మాత నాగవంశీతో పాటు, చిత్ర యూనిట్‌ సభ్యులపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. థమన్‌ విషయంలో ఏమైనా ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జనవరి 12 విడుదల సంక్రాంతికి...

ఎలాగూ దసరా పండుగ మిస్‌ చేశారు, కనీసం దీపావళి వరకు అయినా సినిమాను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే దీపావళికి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ దీపావళికి ఆదర్శకుటుంబం సినిమా రాకుంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే 2027 సంక్రాంతికి వెంకటేష్ జనవరి 12 విడుదల సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. కనుక ఆ సినిమా విడుదలకు కనీసం రెండు నెలల ముందు, రెండు నెలల తర్వాత గ్యాప్‌ ను అంతా కోరుతున్నారు. కనుక ఆదర్శకుటుంబం సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక స్టార్‌ హీరో సినిమా, ఒక క్రేజీ కాంబో మూవీ ఇలా వాయిదా పడటం అరుదుగా చూస్తూ ఉన్నాం. ఇంతకు ఆదర్శ కుటుంబం ఎప్పటికి వస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News