వరుణ్ 'కొరియన్ కనకరాజు'.. సోలో డేట్ పట్టేశారుగా..

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ కొరియన్ భాషలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథలో కొరియా బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది.

Update: 2026-07-10 14:10 GMT

సోలో రిలీజ్ అంటే ఏ హీరోకైనా పెద్ద ప్లస్. ఇప్పుడు ఆ అవకాశం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కు దక్కినట్లు కనిపిస్తోంది. చాలా రోజులుగా ఆసక్తి రేపుతున్న కొరియన్ కనకరాజు సినిమా విడుదల తేదీని మూవీ టీమ్ ప్రకటించింది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆ రోజు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో వరుణ్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఇప్పటి వరకు చూసుకుంటే సోలో మాత్రం దక్కినట్లే.

 

వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం హారర్ ఫాంటసీ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించే క్రాస్ కల్చర్ కాన్సెప్ట్‌ ను ఆ కథలో చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్‌ లో వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకోగా, సినిమా కథపై ఆసక్తి పెరిగింది. మూవీలోని తొలి పాట కంసాహామ్నిదాకు కూడా మంచి ఆదరణ లభించింది. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించిన ఆ పాటకు తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా సంగీతంపై కూడా అంచనాలు పెరిగాయి. అయితే కొరియన్ కనకరాజు టైటిల్ ప్రకటించినప్పటి నుంచే చర్చ మొదలైంది.

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ కొరియన్ భాషలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథలో కొరియా బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నంగా ఆ చిత్రం ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ లో కీలక భాగాన్ని వియత్నాంలోని అందమైన ప్రాంతాల్లో పూర్తి చేశారు. విజువల్స్‌ తో పాటు కథలోనూ కొత్తదనం చూపించేందుకు మూవీ టీమ్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో కామెడీ నటుడు సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుణ్- సత్య కాంబినేషన్ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేలా ఉంటాయని సమాచారం. వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌ గా నటిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఆ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ తోపాటు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.

టెక్నికల్ గా కూడా సినిమా హై రేంజ్ లో ఉండబోతుందని మూవీ టీమ్ చెబుతోంది. ఇటీవల వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటున్న వరుణ్ తేజ్, ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సోలో రిలీజ్ బెనిఫిట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ, కామెడీ ఎలిమెంట్స్ కలిసి కొరియన్ కనకరాజుకు ఎంతవరకు కలిసి వస్తాయో తెలియాలంటే ఆగస్టు 7 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News