ఒంటరి జీవితం..మరణంపై నటి ఏమన్నారంటే!
బాలీవుడ్ సీనియర్ నటి ఉషా నదకర్ణి పరిచయం అవసరం లేని పేరు. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాది పరిశ్రమకు సేవలందిస్తున్నారు.;
బాలీవుడ్ సీనియర్ నటి ఉషా నదకర్ణి పరిచయం అవసరం లేని పేరు. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాది పరిశ్రమకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పటికీ అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వయసు మీద పడినా? అవకాశాలకు మాత్రం దూరం కాలేదు. నటిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రముఖంగా మరాఠి సినిమాలతో ఎంతో ఫేమస్. హిందీ బుల్లి తెరపైనా ఉషా ముద్ర వేసారు. పలు అవా ర్డులు...రివార్డులు అందుకున్నారు.
ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. కానీ వ్యక్తిగత జీవితంలో ఉషా నదకర్ణి మాత్రం సింగిల్ . ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఒంటరి జీవనం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ` ఒంటరిగా జీవి స్తున్నా. కానీ నాకు ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్కోసారి భయమేస్తుంది. నా కొడుకు ( దత్త పుత్రుడు) విదేశాల్లో ఉంటాడు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. ఇటీవలే సోదరుడిని కోల్పోయాను. నా కోసమంటూ ఎవరూ లేరనే బాధ అప్పుడప్పుడు కలుగుతుంది. ఎందుకంటే నా ఒంటరి తనం ఈనాటిది కాదు.
1987 నుంచి ఇలాగే జీవనం సాగిస్తున్నా. మొదట్లో ఎవరైనా తలుపు తడితే వచ్చి నాపై దాడి చేస్తారని భయపడేదాన్ని. కానీ ఇప్పుడా భయం పూర్తిగా తొలగిపోయింది. ఎవరి మరణం ఎలా రాసిపెట్టు ఉందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలో చనిపోతే పక్కింటి వాళ్లు డోర్ కొడతారు. నేను తీయకపోతే కాసే పటికి పగలగొట్టి లోపలికి వస్తారు. అప్పుడు వాళ్లే అర్దం చేసుకుంటారు నేను చనిపోయానని. భూమ్మీదకు ఒంటరిగా నాకు తెలియకుండానే వచ్చేసాను. అలాగే తిరిగి వెళ్లిపోతాం అన్న దానిపై ఓ క్లారిటీ ఉంద న్నారు. ఒంటరి జీవితం గడిపే వాళ్లకు ఈ విషయం బాగా అర్దమవుతుందన్నారు.
ప్రస్తుతం ఉషా నది కర్ణి పలు మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మద్యనే ఓ రెండు హిందీ సినిమా లకు సైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. 1979 లో `సిన్హాసన్` అనే మరాఠీ సినిమాతో ఉషా నదకర్ణి నటిగా కెరీర్ ఆరంభించారు. `ముసాఫిర్`, `ప్రతిఘాట్` చిత్రాలతో బాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. అదే సమయం లో హిందీ సీరియళ్లలోనూ అవకాశాలు రావడంతో అక్కడా తన ముద్ర వేసారు.