ఎన్టీఆర్, నీల్ మూవీ.. ఆ యాక్టర్ హింట్ ఇచ్చేశాడహో..!

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక భారీ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-11-29 03:45 GMT

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక భారీ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్.. మాస్ యాక్షన్ అంతా కూడా వేరే లెవెల్ అంటున్నారు. ఐతే ఎన్టీఆర్, నీల్ సినిమాలో మలయాళ స్టార్ ఒకరు ప్లేస్ అన్నారన్న టాక్ కొన్నాళ్లుగా నడుస్తుంది. మలయాళంలో తన స్టైల్ లో సినిమాలు చేస్తూ వెళ్తున్న టోవినో థామస్ ఎన్టీఆర్ నీల్ కాంబో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఐతే అది అఫీషియల్ గా మాత్రం ఎవరు చెప్పలేదు.

నీల్, ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నాడని క్లారిటీ..

లేటెస్ట్ గా టోవినో థామస్ IFFI అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి దానిపై మీ రియాక్షన్ అని అడిగితే.. అది నేను ఇప్పుడు చెప్పలేను అని అన్నాడు. సో లేదు కాదు అన్న ఆన్సర్ కాకుండా ఇలా చెప్పలేనని ఒక కన్ ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు టోవినో థామస్. సో ఈ కామెంట్ తోనే అతను నీల్, ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నాడని క్లారిటీ ఇస్తుంది.

మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టోవినో థామస్ అలాంటి స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఆ సినిమాపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇంతకీ నీల్, ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఆయన్ను ఎలా వాడుకుంటాడన్న డిస్కషన్ మొదలైంది. టోవినో థామస్ కూడా తన సోలో సినిమాలతో పాటు స్టార్ కాంబినేషన్స్ తో కూడా ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు.

మైత్రి రవి శంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా..

ఎన్టీఆర్ నీల్ సినిమాతో టోవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తన మలయాళ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన టోవినో థామస్ తప్పకుండా తారక్ సినిమాతో ఇక్కడ మరింత క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు. ఐతే నీల్, ఎన్టీఆర్ సినిమాకు మొన్నటిదాకా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇప్పుడు దానికి మించిన టైటిల్ ఒకటి చూస్తున్నారట. మైత్రి రవి శంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందని ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని అన్నారు.

ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కె.జి.ఎఫ్ 1 & 2, సలార్ సీజ్ ఫైర్ తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. ఐతే ఈసారి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నీల్ నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్ తో రాబోతున్నారు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.

Tags:    

Similar News