ఇద్ద‌రు ఇద్ద‌రే..ఒకే త‌ర‌హా మేకర్స్!

ఈ క్ర‌మంలో క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు దూర‌మ‌వుతున్నామా? అన్న సందేహం వ్య‌క్త మ‌వుతోన్న నేప‌థ్యంలో? అందుకు మేము ఇద్ద‌రం ముగ్గురుం ఉన్నామంటూ గోపీచంద్ మ‌లినేని..బాబి లు గుర్తు చేస్తున్నారు.;

Update: 2025-10-22 10:30 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లు తెర‌కెక్కుతున్నాయి. వాటితో పాన్ ఇండియాలో మంచి విజ‌యాలు అందుకుంటున్నారు. క‌మ‌ర్శియ‌ల్ కంటెంట్ కంటే ? కొత్త ద‌నానికే ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు పెద్ద పీట వేస్తున్నారు. పాన్ ఇండియాకి క‌నెక్ట్ చేయాలంటే? వైవిధ్యం అన్న‌ది త‌ప్ప‌నిస‌రి. ఇలా కొంత మంది ద‌ర్శ‌కుల ప్ర‌యాణం ముందుకు సాగుతుంది. రాజమౌళి, సుకుమార్, చందు మొండేటి, ప్ర‌శాంత్ నీల్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, బుచ్చిబాబు లాంటి వాళ్లు వినూత్న ఐడియలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ త్ర‌యం:

ఈ క్ర‌మంలో క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు దూర‌మ‌వుతున్నామా? అన్న సందేహం వ్య‌క్తం మ‌వుతోన్న నేప‌థ్యంలో? అందుకు మేము ఇద్ద‌రం ముగ్గురుం ఉన్నామంటూ గోపీచంద్ మ‌లినేని..బాబి లు గుర్తు చేస్తున్నారు. వీరిద్ద‌రి సినిమాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేయ‌డంలో ఇద్ద‌రు ఇద్ద‌రే. ఈ విష‌యంలో ఒక‌రికొక‌రు పోటీ ప‌డి మ‌రీ ప‌ని చేస్తారు. వీరిద్ద‌రితో పాటు కాస్త డిఫ‌రెంట్ గా ప్ర‌య‌త్నించినా వీళ్ల బాట‌లోనే క‌నిపిస్తాడు అనీల్ రావిపూడి. త‌న క‌థ‌ల్లో చిన్న లాజిక్ వాడి సినిమాను కమ‌ర్శి య‌లైజ్ చేయ‌డంలో అనీల్ దిట్ట‌.

ఆ త్ర‌యం త‌గ్గేదే లేదు:

తెలుగు సినిమా పాన్ ఇండియాని ఏల్తోన్న త‌రుణంలో? ఈ ముగ్గురు ద‌ర్శ‌కుల‌పై అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు వ్య‌క‌మ‌వుతున్నాయి. రోటీన్ సినిమాలు చేస్తున్నారు? కొత్త ఐడియాలతో క‌థ‌లు రాయ‌డం లేదు? అంటూ విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వీటిపై ఓ సంద‌ర్భంలో అనీల్ రావిపూడి కూడా త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఎవ‌రి స్టైల్ వారికి ఉంటుంద‌ని..త‌న పాయింట్ న‌చ్చ‌డంతోనే సినిమాలు హిట్ అవుతున్నాయ‌ని..అంత‌కు మంచిన లాజిక్ లు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని..ఎవ‌రు ఏమ‌నుకున్నా? త‌న జ‌మానా కొన‌సాగినంత కాలం అవే సినిమాలు చేస్తాన‌ని గ‌ట్టిగానే చెప్పాడు.

అంచ‌నాలు లేకుండా సంచ‌న‌లం:

మిగ‌తా ఇద్ద‌రు కూడా చాలా సంద‌ర్భంల్లో విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. కానీ వాటిని వారిద్ద‌రు ఎంత మాత్రం సీరియ‌స్ గా తీసుకోలేదు. మీ ప‌ని మీదే..మా ప‌ని మాదే అన్న తీరున లైట్ తీసుకున్నారు. అయితే ఇలాంటి ద‌ర్శ‌కులు ప‌రిశ్ర మ‌కు అవ‌స‌ర‌మే. బ్యాక‌ప్ లా ప‌ని చేస్తున్నారు. పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు..డిఫ‌రెంట్ అటెంప్స్ట్ బెడిసి కొట్టిన స‌మ‌యంలో స‌క్సెస్ చూపించేది రొటీన్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలే. అందుకు ఉదాహ‌ర‌ణ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` చిత్రం. అదే సీజ‌న్ లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాలో బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల‌య్యాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `సంక్రాంతి కి వ‌స్తున్నాం `బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అందుకే టాలీవుడ్ కి ఆ ముగ్గురు వ‌స‌ర‌మే.

Tags:    

Similar News