బెల్లంకొండ జోడీ.. ఆ ముద్దులో ఎంత ప్రేమో..
ఆ సమయంలో సాయి శ్రీనివాస్ కూడా ఎంతో హ్యాపీగా నవ్వుతూ కనిపించడం గమనార్హం. భార్య చూపిస్తున్న లవ్ కు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన ప్రేయసి కావ్య రెడ్డి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో ఆ జంట గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ట్రెడిషనల్ గా జరిగిన ఆ వేడుక సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ సమీపంలో రాత్రి వేళ జరిగిన ఆ మ్యారేజ్ కు ఇరువురు కుటుంబాల పెద్దలు హాజరై ఆశీర్వదించారు. అనంతరం మే 1న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించగా.. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు భారీగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా, రిసెప్షన్ సందర్భంగా జరిగిన ఒక క్యూట్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈవెంట్ మధ్యలో కావ్య రెడ్డి తన భర్త సాయి శ్రీనివాస్ బుగ్గపై ప్రేమగా కిస్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కిస్ ఇచ్చిన వెంటనే లిప్ స్టిక్ తుడుచుకుంటూ కనిపించిన ఆమె నవ్వు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో ఫుల్ షేర్ అవుతూ ట్రెండింగ్ లో నిలిచింది.
ఆ సమయంలో సాయి శ్రీనివాస్ కూడా ఎంతో హ్యాపీగా నవ్వుతూ కనిపించడం గమనార్హం. భార్య చూపిస్తున్న లవ్ కు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఇదే కాకుండా.. రిసెప్షన్ ఈవెంట్ లో తన భార్యకు శ్రీనివాస్ కిస్ చేసిన వీడియో బయటకు రావడంతో, అది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక బెల్లంకొండ జంటను చూసిన నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలతో కనిపించే సాయి శ్రీనివాస్, నిజ జీవితంలో ఇంత రొమాంటిక్ గా ఉండటం అభిమానులను మెప్పిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ప్రతి ఫోటోలో.. ప్రతి వీడియోలో క్లియర్ గా కనిపిస్తోందని చెబుతున్నారు.
అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సాయి శ్రీనివాస్ తన భార్యను అభిమానులకు పరిచయం చేస్తూ ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. నా పెళ్లాం నిప్పు రా అంటూ సరదాగా మీమ్ తో పోస్ట్ పెట్టిన ఆయన, 'నేను నిర్మించుకున్న ప్రతిదానికంటే గొప్పదాన్ని కనుగొన్నాను. ప్రపంచమా.. నా భార్యను పరిచయం చేసుకుంటున్నాను' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఆ పోస్ట్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆ జంట, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం శ్రీనివాస్ కావ్యలకు సినీ సెలబ్రిటీలతోపాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కెరీర్ పరంగా చూస్తే, శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మొత్తానికి నూతన దంపతుల క్యూట్ మొమెంట్స్ సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తున్నాయి.