లెనిన్ లో స్పెషల్ సాంగ్.. ఆలోచన ఉన్నా అమలు చేయకపోవడానికి కారణం?

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం లెనిన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2026-07-29 05:16 GMT

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ లకు ప్రత్యేక చోటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఆడియన్స్ స్పెషల్ సాంగ్ ల కోసం థియేటర్ కి వెళ్తున్న సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాం..అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లెనిన్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ అనుకున్నారట. పైగా స్టార్ హీరోయిన్లతో ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో నర్తింపచేయాలని కూడా ఆలోచన వచ్చిందట. కానీ ఆ స్పెషల్ సాంగ్ మొత్తానికే తీసేయడం వెనుక అసలు కారణాన్ని చెబుతూ.. ఈ చిత్ర సంగీత దర్శకుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి లెనిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ అనుకొని తీసివేయడం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

లెనిన్ సినిమాలో స్పెషల్ సాంగ్..

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం లెనిన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేస్తున్న చిత్రంగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఒకవైపు చిత్ర బృందం గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుతూ ఉండగా.. మరొకవైపు ఈ చిత్ర నిర్మాత తమన్ కూడా మ్యూజికల్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు.. అందులో భాగంగానే ఈ స్పెషల్ సాంగ్ గురించి ఆయన ప్రస్తావించారు.

స్పెషల్ సాంగ్ అనుకొని తొలగించడం పై తమన్ క్లారిటీ..

ఇంటర్వ్యూలో భాగంగా తమన్ మాట్లాడుతూ.. "లెనిన్ సినిమాకి కమర్షియల్ గా ఆడియన్స్ లో అంచనాలు పెంచడానికి.. అలాగే సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మొదట నిర్మాతలు ఒక ఐటమ్ నంబర్ ఉండేలా చూడాలనుకున్నారు. ఈ ప్రత్యేక పాట కోసం పూజా హెగ్డే, రష్మిక మందన్న లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే డెవలప్ అవుతున్న కొద్దీ ఈ పాట సినిమా కథనంతో సహజంగా కలిసి పోలేదు. ప్రత్యేక పాటను జోడించడం కథ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని.. విమర్శకులు సినిమాలో స్పెషల్ సాంగ్ పెడితే కథకు సంబంధం లేకుండా పాటను పెట్టారని.. స్పీడ్ బ్రేకర్ అని విమర్శించే అవకాశం ఉందని.. ముందే భావించి నిర్మాతలు ఈ సినిమా నుండి స్పెషల్ సాంగ్ ఆలోచనను తొలగించారు. సినిమా కథనం వేగాన్ని కొనసాగించడం కోసం.. చివరికి పాటని తొలగించాలని నిర్ణయించుకున్నారు.

నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను - తమన్

అయితే ఆ పాటకు చార్ట్ బస్టర్ అయ్యే సత్తా ఉంది. సంగీత ప్రియులను ఆకర్షిస్తుందని నేను బలంగా నమ్మాను. కానీ స్క్రీన్ ప్లే తగ్గట్టుగా ఆ పాట సినిమాలో కలవకపోవడం వల్లే ఆ పాటను తీసేశారు. ఈ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను" అంటూ తెలిపారు. ఇక పాట తొలగించినప్పటికీ.. ఈ సినిమా మ్యూజికల్ పరంగా మంచి సక్సెస్ ను అందుకుంది.

Tags:    

Similar News