స్టార్స్ ను నమ్ముకొని బొక్కబోర్ల పడ్డ నిర్మాతలు.. అశ్వినీ దత్ మాటల్లో!
ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ లాంటి నిర్మాతలు కూడా స్టార్స్ ను నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
సినిమా హిట్ అవ్వాలి అంటే పెద్దపెద్ద నటీనటులు ఉంటే సరిపోదు...మంచి కంటెంట్ కూడా ఉండాలి. విజువలైజేషన్, కథ పక్కాగా ఉన్నప్పుడే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం స్టార్ట్స్ ను మాత్రమే సినిమాలో పెట్టి కథ లేకుండా సినిమాను ముందుకు నెట్టాలి అంటే సాహసంతో కూడుకున్న పని. ముఖ్యంగా ఒకటో రెండో స్టార్స్ ను చూసే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ నేటి కాలంలో సినిమా సక్సెస్ అవ్వాలి అంటే కచ్చితంగా కథ ఉండాల్సిందే. కథ లేకుండా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు . అందుకే స్టార్స్ ను నమ్ముకొని కథను పక్కనపెట్టి బొక్క బోర్ల పడ్డ నిర్మాతలు చాలామంది ఉన్నారు.
ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ లాంటి నిర్మాతలు కూడా స్టార్స్ ను నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్, చిరంజీవి వంటి దిగ్గజ నటులతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈయన.. ఒక స్టార్ హీరో తో సినిమా చేసి రోడ్డున పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అశ్వినీ దత్.. ఆ తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర, మహానటి ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసి భారీగా నష్టపోయారు.. దీంతో ఆయన పని అయిపోయింది. బుట్ట సర్దే టైమ్ వచ్చింది అనుకున్న సమయంలో కల్కి 2898AD సినిమా చేసి తన బ్యానర్ ఖ్యాతిని మరింత పెంచుకున్నారు.
ఇక అలాంటి ఈయన ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేసి ఏకంగా 32 కోట్ల రూపాయల మేరా నష్టాన్ని చవిచూసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. 2011లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం శక్తి. అప్పట్లోనే రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయగా ప్రపంచవ్యాప్తంగా 700 కి పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే కథ , కథనం ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. ముఖ్యంగా ఈ సినిమాతో నిర్మాత 32 కోట్ల రూపాయలు నష్టపోయారు.
ఇలా స్టార్స్ ను నమ్ముకొని నష్టపోయిన నిర్మాతలలో మరో నిర్మాత నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి వారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా చేసి రోడ్డున పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికీ అటు మ్యూజిక్ పరంగా కల్ట్ క్లాసిక్ గా నిలిచినప్పటికీ.. ఆతరం ఆడియన్స్ ను ఆ సినిమా మెప్పించలేకపోయింది. దాంతో నిర్మాతగా నాగబాబు కోలుకోలేని దెబ్బ ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేసి లాభాలు పొందుతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే స్టార్స్ ను నమ్ముకుని ఇబ్బంది పడ్డ నిర్మాతల జాబితాలో మరో నిర్మాత కూడా చేరారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ బాబు. ఈతరం ఆడియన్స్ కి ఈయన గురించి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి మహేష్ బాబు తో ఖలేజా సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశారు. 2010లో క్రేజీ కాంబినేషన్స్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ రెండు సినిమాలతో ఆయనకు ఏకంగా రూ.100 కోట్ల మేర నష్టం వచ్చిందని, అప్పుడు కనీసం తనను పట్టించుకున్న వారు కూడా లేరని మీడియా ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలామంది నిర్మాతలు కేవలం స్టార్ పేరిట వారిని నమ్ముకుని కథను పట్టించుకోకుండా సినిమాలు తీసి ఏకంగా ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడే పరిస్థితిని ఎదుర్కోవడం ఆశ్చర్యకరం.