ఫీజు కూడా తీసుకోకుండానే అన్నీ నేర్పారు
తమన్నా గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మిల్కీ బ్యూటీగా గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారామె.;
తమన్నా గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మిల్కీ బ్యూటీగా గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారామె. మధ్యలో అవకాశాల్లేక కెరీర్ కాస్త డల్ అయింది కానీ ఇప్పుడు తిరిగి పుంజుకుంది. అయితే అందరికీ గురువులున్నట్టే తనకి కూడా గురువు ఉన్నారని, తనకు యాక్టింగ్ నేర్పించిన గురువుతో కలిసి రీసెంట్ గా తాను స్క్రీన్ ను కూడా షేర్ చేసుకున్నానని తమన్నా తెలిపారు.
యాక్టింగ్ లో తొలి గురువు ఆయనే
యాక్టింగ్ లో తన మొదటి గురువు బాలీవుడ్ యాక్టర్ నీరజ్ కబీ అని రీసెంట్ గా తమన్నా చెప్పారు. తమన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో రూపొందిన డూ యూ వాన్నా పార్టనర్ లో నీరజ్ తో కలిసి తమన్నా స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. తాను 13 ఏళ్ల ఏజ్ లో ఉన్నప్పుడే నీరజ్ వద్ద యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నానని, తనకు యాక్టింగ్ నేర్పించినందుకు ఆయన ఫీజు కూడా తీసుకోలేదని తమన్నా చెప్పారు.
వాళ్లందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు
నీరజ్ తనకు మాత్రమే కాకుండా మరో 13 మందికి కూడా యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారని, వారందరూ కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారని తమన్నా చెప్పారు. అయితే తమన్నాకు ట్రైనింగ్ ఇవ్వడంపై నీరజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ అప్పట్లో వర్క్‌షాప్స్ నిర్వహించే టైమ్ లో తమన్నా తన వద్దకు ట్రైనింగ్ కోసం వచ్చిందని నీరజ్ కబీ అన్నారు.
ఆ కష్టం ఫలించింది
ట్రైనింగ్ టైమ్ నుంచే తమన్నాసీరియస్ గా వర్క్ చేసేదని, తన కష్టమే తనను ఈ పొజిషన్ కు తీసుకొచ్చిందని తమన్నాను నీరజ్ కబీ ప్రశంసించారు. ఇక తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ విషయానికి వస్తే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారనే పాయింట్ తో ఇది రూపొందింది. సెప్టెంబర్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.