అశ్వినీదత్ అండ్ డాటర్స్.. ఆ ధైర్యం అందరికీ ఉంటుందా?

కొత్త దర్శకుడిని నమ్మి చేసిన ఎవడే సుబ్రమణ్యం ఒక ప్రయోగంగా నిలిచింది. లైఫ్ మెసేజ్ ను చెప్పే ఆ కథ కమర్షియల్ ఫార్మాట్‌ కు భిన్నంగా ఉండినా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Update: 2026-06-14 02:30 GMT

టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థలు అంటే సాధారణంగా స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, సేఫ్ సబ్జెక్టులు గుర్తుకు వస్తాయి. కానీ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ జర్నీ చూస్తే మరో విషయం క్లియర్ గా కనిపిస్తుంది. అదే రిస్క్ తీసుకునే ధైర్యం. ముఖ్యంగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆ ధైర్యాన్ని కొత్త జనరేషన్ కు పరిచయం చేశారనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఒకానొక టైమ్ లో వైజయంతీ మూవీస్ స్పీడ్ తగ్గిన సమయంలో, కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా దానికి కొత్త మార్గం చూపించారు. ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటూ, నమ్మిన కథలు తీసుకురావడంలో వెనుకడుగు వేయలేదు. అదే ఇప్పుడు వారి ప్రత్యేకతగా మారింది. రెండు బ్యానర్ల రీసెంట్ జర్నీ చూసుకుంటే ఒకే రకమైన సినిమాలు కనిపించవు.

కొత్త దర్శకుడిని నమ్మి చేసిన ఎవడే సుబ్రమణ్యం ఒక ప్రయోగంగా నిలిచింది. లైఫ్ మెసేజ్ ను చెప్పే ఆ కథ కమర్షియల్ ఫార్మాట్‌ కు భిన్నంగా ఉండినా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత వచ్చిన మహానటి అయితే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే చిత్రంగా నిలిచింది. సావిత్రి జీవితాన్ని మూవీగా తీయడం చిన్న విషయం కాదు. కానీ ఆ సాహసం పాన్ ఇండియా గుర్తింపును తీసుకొచ్చింది.

అదే విధంగా జాతిరత్నాలు వంటి చిన్న సినిమాను నమ్మి నిర్మించడం కూడా వారి ఆలోచనా విధానాన్ని చూపించింది. స్టార్ హీరోలు లేకుండా ఎంటర్టైన్మెంట్ నమ్మి తీసిన ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. మరోవైపు సీతారామం వంటి క్లాసికల్ ప్రేమకథను తెరకెక్కించి, ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ కు ప్యూర్ లవ్ స్టోరీస్ కూడా పెద్ద విజయాలు సాధిస్తాయని నిరూపించారు.

ఇక కల్కి 2898 AD మూవీ విషయానికి వస్తే.. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్‌ తో, వరల్డ్ రేంజ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రయత్నం చేశారు. అలాంటి కథను నమ్మి ముందుకు వెళ్లడం కూడా సాహసమే. అయితే లిస్ట్ లో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్న మూవీ సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును మళ్లీ దర్శకుడిగా తీసుకురావడం, ఆయన ఆలోచనకు ఫ్రీడమ్ ఇవ్వడం, మాటల కంటే సంగీతం, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే స్టోరీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధారణ విషయం కాదు.

ప్రస్తుత ట్రెండ్‌ లో ఫార్ములా సినిమాలే సేఫ్ అని భావించే పరిస్థితుల్లో, ఇలాంటి కాన్సెప్ట్‌ ను నమ్మి నిర్మించడం వెనుక ధైర్యం కనిపిస్తోంది. అందుకే అశ్వినీ దత్ ఫ్యామిలీ నిర్మిస్తున్న సినిమాల గురించి చర్చ వచ్చినప్పుడు, కేవలం భారీ బడ్జెట్ల గురించి కాదు.. ఆ ధైర్యం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అందరూ సినిమాలు నిర్మిస్తారు. కానీ ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాకుండా, కొత్త దారిని చూపించే సాహసం చేయడం మాత్రం కొద్దిమందికే సాధ్యమవుతుంది. ప్రస్తుతం వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ల కోసం ఇలాంటి ధైర్యం అందరికీ ఉండదనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News