'బ్రదర్స్' పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఎలాంటి హిట్స్ కొడతారో?

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలంతా తమ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.;

Update: 2025-04-23 05:50 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలంతా తమ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్ చేసినప్పుడే పాన్ ఇండియా విషయం చెప్పి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ తమ సినిమాలతో నేషనల్ వైడ్ గా లక్ ను టెస్ట్ చేసుకోనున్నారు!

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రేమ, గాఢమైన భావోద్వేగాలతో కూడిన గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాగా తీర్చిదిద్దిన ఆ సినిమా.. మే1వ తేదీన విడుదలవ్వనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ మూవీ.. రీసెంట్ గా యూ/ఏ సర్టిఫికెట్‌ ను అందుకుంది.

అయితే రెట్రో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా సూర్యకు షాకిచ్చింది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా.. డిజాస్టర్ గా మారింది. దీంతో ఇప్పుడు సూర్య ఆశలన్నీ రెట్రో మూవీపైనే ఉన్నాయని చెప్పాలి.

దీంతో ఇప్పుడు ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో సూర్య తమ్ముడు, స్టార్ హీరో కార్తీ ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్ సీక్వెల్ సర్దార్ -2లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

అయితే సర్దార్-1 తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ ఇప్పుడు సీక్వెల్ ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రోలాగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్.. హిందీ వెర్షన్ ను విడుదల చేయగా.. అక్కడా కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం గమనార్హం.

దీంతో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అయితే సర్దార్-2 పాన్ ఇండియా హిట్ అయితే నార్త్ లో కార్తీ మార్కెట్ ఓ రేంజ్ లో ఓపెన్ అవుతుంది. అలా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు.. రెట్రో, సర్దార్ తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News