ఓటీటీలో హిట్టు కొట్టు ఆఫర్లు పట్టు
టాలీవుడ్‌లో చాలా యంగ్ టాలెంట్ వుంది కానీ కొత్త వారికి చాలా వరకు అవకాశాలు లభించడం లేదు.;
టాలీవుడ్‌లో చాలా యంగ్ టాలెంట్ వుంది కానీ కొత్త వారికి చాలా వరకు అవకాశాలు లభించడం లేదు. దీంతో ,ఆలా మంది ఓటీటీ ప్లాట్ ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ తాము అనుకున్న కొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దాంతో హీరోల, నిర్మాత దృష్టిలో పడి భారీ ఆఫర్లని దక్కించుకోవడం తెలిసిందే. `90`s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` అంటూ యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ చేసిన ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయి సూపర్ హిట్ కావడం తెలిసిందే.
ఈ సిరీస్ తరువాతే ఆదిత్య హాసన్‌కు నిర్మాతలు, హీరోలు సినిమాలు చేస్తామని ఆఫర్లు ఇచ్చారు. అలా వచ్చిన ఆఫర్‌ని ఓకే చేసిన ఆదిత్య హాసన్ `ప్రేమలు` సినిమాకు డైలాగ్స్ అందించడంతో అది సూపర్ హిట్ అయింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాన్ని అందించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని మరో యంగ్ డైరెక్టర్ ఫాలో అయినట్టున్నాడు. తనే సన్నీ సంజయ్. తను డైరెక్టర్‌గా పరిచయమైన మూవీ `అనగనగ..`.
సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో కాజల్ చౌదరి, విహర్ష్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా పమంచి ఆదరణని సొంతం చేసుకుంటోంది. నేటి విద్యా వ్యవస్థపై సున్నితమైన అంశాల్ని చర్చిస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలనే డిమాండ్ మొదలైంది. దీంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు మేకర్స్ ఈ సినిమాను త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సన్నీ సంజయ్‌కి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ఇప్పటికే ఈటీవీ విన్‌లో మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన సన్నీ సంజయ్ దీని తరువాత అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాజెక్ట్‌ని కూడా ఓకే చేసినట్టుగా తెలిసిందే. అంతే కాకుండా ఈ సంస్థల నుంచి సన్నీ సంజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అంతే కాకుండా హీరో అడివి శేష్ కూడా తనకు ఆఫర్ ఇచ్చాడు. మంచి కథతో వస్తే కలిసి వర్క్ చేద్దామని ఆఫర్ ఇవ్వడం విశేషం.