సందీప్ తో విజయ్ కొడుకు 'సిగ్మా'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు

కోలీవుడ్ 'దళపతి' విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడన్న న్యూస్ వచ్చినప్పటి నుంచి కోలీవుడ్, టాలీవుడ్‌లో ఫుల్ బజ్ నడుస్తోంది.;

Update: 2025-11-10 04:54 GMT

కోలీవుడ్ 'దళపతి' విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడన్న న్యూస్ వచ్చినప్పటి నుంచి కోలీవుడ్, టాలీవుడ్‌లో ఫుల్ బజ్ నడుస్తోంది. ఆ స్టార్ కిడ్ తన డెబ్యూ మూవీ కోసం ఎవరిని హీరోగా తీసుకుంటాడా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. ఫైనల్‌గా, జేసన్ తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్‌ను లాక్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఏకంగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో, అంచనాలు డబుల్ అయ్యాయి.




 


లేటెస్ట్ గా, ఈ మల్టీ లింగ్వల్ యాక్షన్ అడ్వెంచర్‌కు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆ టైటిలే.. 'సిగ్మా'. ఈరోజు రిలీజ్ చేసిన 'సిగ్మా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే సినిమా వైబ్ ఏంటో క్లియర్‌గా అర్థమవుతోంది. డబ్బు కట్టలు, గోల్డ్ బార్లు, ఏనుగు దంతాలు.. ఇలా కోట్ల విలువైన నిధి కుప్పపై సందీప్ కిషన్ చాలా రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో, ఫైట్‌కు రెడీ అన్నట్టు కూర్చున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే ఇది పక్కా హై యాక్షన్ ఫీస్ట్ సినిమా అని అర్ధమవుతుంది.

ఇంత పెద్ద నిధి కోసం సందీప్ చేస్తున్న వేట ఎలా ఉంటుందనేది పోస్టర్‌తోనే ఆసక్తిని పెంచేశారు. 'సిగ్మా' అనే టైటిల్ పెట్టడానికి కూడా మేకర్స్ ఒక సాలిడ్ రీజన్ ఇచ్చారు. ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. "సిగ్మా" అంటే ఒక ఫియర్‌లెస్ తోడేలు. అంటే, ఎవరితో సంబంధం లేకుండా, ఒక అండర్‌డాగ్‌లా వచ్చి, తన ఓన్ రూల్స్‌తో, భారీ టార్గెట్లను రీచ్ అయ్యే క్యారెక్టర్ అన్నమాట.

ఈ కాన్సెప్ట్ యూత్‌కు గట్టిగా కనెక్ట్ అయ్యేలా ఉంది. జేసన్ సంజయ్ మొదటి సినిమానే అయినా, టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ అడ్వెంచర్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సేషనల్ కంపోజర్ థమన్‌ను తీసుకున్నారు. హెయిస్ట్ థ్రిల్లర్లకు థమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ చేయనున్నారు.

సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. కేవలం 65 రోజుల్లోనే 95% షూటింగ్ కంప్లీట్ చేశారట. ఇక కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. సందీప్ కిషన్ సరసన 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు రాజు సుందరం, సంపత్ రాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాలో చాలా ఎగ్జయిటింగ్ క్యామియోలు కూడా ఉన్నాయని చెప్పి, మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేశారు.

Tags:    

Similar News