ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ సూప‌ర్‌హిట్ హార్ర‌ర్ కామెడీ

రీసెంట్ గా వ‌చ్చిన క‌న్న‌డ హార్ర‌ర్ కామెడీ సు ఫ్ర‌మ్ సో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-06 07:16 GMT

రీసెంట్ గా వ‌చ్చిన క‌న్న‌డ హార్ర‌ర్ కామెడీ సు ఫ్ర‌మ్ సో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అంతా కొత్త‌వారితో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమాగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన మూవీ ఏది ఏంటే వెంట‌నే గుర్తొచ్చేది సు ఫ్ర‌మ్ సో సినిమానే.

రూ.6 కోట్ల బ‌డ్జెట్..రూ. 100 కోట్ల క‌లెక్ష‌న్లు

కేవ‌లం రూ.6 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని భాష‌ల్లోనూ క‌లిపి రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. అయితే ఈ సినిమా పోస్ట్ థియేట్రిక‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సెప్టెంబ‌ర్ 5 నుంచి సు ఫ్ర‌మ్ సో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంద‌ని గ‌తంలో కొన్ని వార్త‌లు రాగా, సినిమా కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఓటీటీలో..

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అఫీషియ‌ల్ అప్డేట్ వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 9 నుంచి సు ఫ్ర‌మ్ సో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలిపారు. క‌న్న‌డ తో పాటూ మ‌రో రెండు భాష‌ల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంద‌ని చెప్పారు కానీ ఆ మిగిలిన రెండు భాష‌లేంట‌నేది మాత్రం చెప్ప‌లేదు.

భ‌య‌పెడుతూనే న‌వ్వించిన సినిమా

జులై 25న క‌న్న‌డ‌లో రిలీజై సెన్సేష‌నల్ హిట్ గా నిలిచిన సు ఫ్ర‌మ్ సో ను తెలుగులో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆగ‌స్ట్ 8న రిలీజ్ చేయ‌గా, రూర‌ల్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో వ‌చ్చిన ఈ మూవీ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించింది. జాన‌ప‌దం, ఊళ్ల‌లో ఉండే మూఢ న‌మ్మ‌కాలు బ్యాక్ డ్రాప్ గా తెర‌కెక్కిన సు ఫ్ర‌మ్ సో ఆడియ‌న్స్ ను కాస్త భ‌య‌పెడుతూనే క‌డుపుబ్బా న‌వ్వించింది. ఈ సినిమాలో సంధ్య ఆర‌కెరె, జేపీ తుమినాద్, ప్ర‌కాష్ తుమినాడ్, శ‌నీల్ గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, జేపే తుమినాద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Tags:    

Similar News