వారణాసి తర్వాత ఆగుతారా? ఆలోచిస్తారా?
రాజమౌళి ప్రతి ప్రాజెక్టుతోనూ తన పరిధిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి బాక్సాఫీస్ విజయాలు సాధిస్తున్నా ఆయన ఎంచుకునే కథల స్కేల్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది.
రాజమౌళి ప్రతి ప్రాజెక్టుతోనూ తన పరిధిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి బాక్సాఫీస్ విజయాలు సాధిస్తున్నా ఆయన ఎంచుకునే కథల స్కేల్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. మగధీర సమయం నుంచి మొదలైన ఈ గ్రాండియర్ ప్రయాణం బాహుబలి, ఆర్ఆర్ఆర్ దాటుకుని ఇప్పుడు వారణాసి వరకు చేరుకుంది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ తో ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అయితే ఈ భారీ చిత్రం తర్వాత జక్కన్న ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సక్సెస్ తర్వాత రాజమౌళి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తనపై పెరిగిపోయిన భారీ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి, రూట్ మార్చి మర్యాద రామన్న లాంటి చిన్న బడ్జెట్ కాన్సెప్ట్ సినిమా చేశారు. కేవలం స్టార్ పవర్, భారీ గ్రాఫిక్స్ పైనే కాకుండా కథలోని డ్రామాతోనూ ప్రేక్షకులను మెప్పించగలనని ఆ రోజుల్లో నిరూపించారు. ఆ స్ట్రాటజీ అప్పట్లో బాగా వర్కౌట్ అయింది.
కానీ బాహుబలి రెండు భాగాలు, ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఆయన మార్కెట్ స్పాన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న వారణాసి ప్రాజెక్ట్ బడ్జెట్ గత సినిమాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ. ఏకంగా వేల కోట్ల వ్యాపార అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని, ప్రొడక్షన్ వాల్యూస్ ను ఇండియన్ స్క్రీన్ పైకి తీసుకువస్తోంది.
గ్లోబల్ లోకేషన్లు, గ్రాండ్ విఎఫ్ఎక్స్ వర్క్ తో ఈ సినిమా ఉండనుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా బిజినెస్ పొటెన్షియల్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం మోస్తోంది. ఈ స్థాయి విజువల్ వండర్ పూర్తయిన తర్వాత రాజమౌళి తర్వాతి సినిమా ఏంటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. వేల కోట్ల బడ్జెట్ తో సాగిన ఈ జర్నీ తర్వాత మళ్లీ అంతకుమించిన భారీ కంటెంట్ తోనే ముందుకు వెళ్తారా లేక గతంలో లాగా కాస్త విరామం తీసుకుని చిన్న కాన్సెప్ట్ వైపు చూస్తారా అనేది అసలు డౌట్.
అయితే ఒకసారి పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చాక, గ్లోబల్ మార్కెట్ అంచనాలను తట్టుకోవడానికి మళ్లీ బిగ్ స్కేల్ మూవీస్ చేయక తప్పదనే అభిప్రాయం కూడా ఉంది. వారణాసి థియేటర్లలో సాధించే ఫలితం, బాక్సాఫీస్ వసూళ్ల రేంజ్ కూడా రాజమౌళి తర్వాతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ సినిమా అంతర్జాతీయంగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, పెట్టిన భారీ పెట్టుబడికి ఏ స్థాయిలో లాభాలు వస్తాయి అనే లెక్కలపై అందరి ఫోకస్ ఉంది.
ఆ ఫలితాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే జక్కన్న తన తర్వాతి ప్రాజెక్ట్ స్కేల్ ని డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంచనాల ప్రెజర్ ను తట్టుకోవడానికి ఆయన మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు రావచ్చు. భారీ బడ్జెట్లు, మైండ్ బ్లాకింగ్ విజువల్స్ మాత్రమే కాదు, కంటెంట్ లోని ఎమోషన్ తన అసలైన బలమని రాజమౌళికి బాగా తెలుసు. అందుకే వారణాసి తర్వాత ఆయన ఏ దారి ఎంచుకున్నా అది ఇండియన్ సినిమా బిజినెస్ ను మరో మెట్టు ఎక్కించేలాగే ఉంటుంది. మరి జక్కన్న ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.