కంటెంట్ కోసం కొత్త టాలెంట్‌పై సితార నమ్మకం!

అనగనగా మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సన్నీ సంజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Update: 2026-09-07 09:30 GMT

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళ్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు కేవలం స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లకే పరిమితం కావడం లేదనే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. భారీ ప్రాజెక్టులతో పాటు కొత్త ఆలోచనలు ఉన్న డైరెక్ట‌ర్లు, పాత్రకు సరిపోయే నటీనటులతో సినిమాలు చేయడంపైనా సంస్థ ప్రత్యేక దృష్టి పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్39 ఈ వ్యూహానికి మరో ఎగ్జాంపుల్ గా నిలవనుందా అనే ఆసక్తి నెలకొంది.

అనగనగా మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సన్నీ సంజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా గ్లింప్స్ ద్వారా నేటి యువత ఎదుర్కొంటున్న భావోద్వేగాలు, పోరాటాలు, వారి ఆలోచనా విధానాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సంకేతాలిచ్చింది. సాధారణంగా సితార లాంటి పేరున్న నిర్మాణ సంస్థ‌లు మంచి సినిమాల కోసం సేఫ్ ఛాయిస్‌గా పేరున్న డైరెక్ట‌ర్ల‌ను ఎంచుకోవడం కామ‌న్. కానీ సితార సంస్థ మాత్రం కొత్త తరహా కథ చెప్పగల డైరెక్ట‌ర్లపై నమ్మకం ఉంచడం ద్వారా కంటెంట్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తోందనే డిస్క‌ష‌న్ జరుగుతోంది.

ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. మేకర్స్ నుంచి ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కొత్త జోడీపై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడ కూడా సితార ఎంపిక వెనుక మ‌రో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కనిపిస్తోంది. కేవలం స్టార్ స్టేటస్ లేదా మార్కెట్ లెక్కల కంటే, కథలోని పాత్రకు ఎవరు సరిపోతారనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇటీవల ఆడియ‌న్స్ అభిరుచులు మారుతున్న నేపథ్యంలో స్టార్ కాస్టింగ్ మాత్రమే సినిమా స‌క్సెస్‌ను డిసైడ్ చేయ‌ద‌నే వాస్తవాన్ని నిర్మాతలు కూడా గుర్తిస్తున్నారు. సరైన కథకు సరిపోయే డైరెక్ట‌ర్, పాత్రకు న్యాయం చేయగల నటీనటులు ఉంటే కొత్త కాంబినేషన్లను ఆడియ‌న్స్ యాక్సెప్ట్ చేస్తార‌నే నమ్మకం పెరుగుతోంది. అందుకే శ్రీ విష్ణు-సన్నీ సంజయ్- ఆషికా రంగనాథ్ కాంబినేషన్‌ను కేవలం మరో కొత్త సినిమా అనుకోవడం కంటే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనుసరిస్తున్న కొత్త కంటెంట్ స్ట్రాటజీలో భాగంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Tags:    

Similar News