ఆ ఆనందపు క్షణాలు మళ్లీ వచ్చేసాయ్.. తడి అందాలతో సిమ్రాన్ సరికొత్త లుక్!

ఆఫ్ స్లీవ్ వైట్ కలర్ బ్యాక్ హుక్ బ్లౌజ్ ధరించి తన అందాలను మరింత రెట్టింపు చేసుకుంది.

Update: 2026-07-15 07:33 GMT

సెలబ్రిటీలు అటు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఇటు అభిమానులను ఆకట్టుకోవడానికి ట్రెండీ ఔట్ఫిట్ తో ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఈ సెలబ్రిటీలు అందం అభినయంతో అలరిస్తూ ఉంటారు. అంతేకాదు రోజుకొక అవుట్ ఫిట్ తో ఫ్యాషన్ ప్రియులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ సిమ్రాన్ చౌదరి.

 

హైదరాబాదీ బ్యూటీ అయిన సిమ్రాన్ చౌదరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూ అందర్నీ మెప్పిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మరొకసారి తొలకరి జల్లులలో తడుస్తూ తన అందాలతో హొయలు పోయింది. ప్లెయిన్ శారీ పై చుక్కల రూపంలో డిజైన్ చేసిన ఖాదీ చీరను కట్టుకొని తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఆఫ్ స్లీవ్ వైట్ కలర్ బ్యాక్ హుక్ బ్లౌజ్ ధరించి తన అందాలను మరింత రెట్టింపు చేసుకుంది. ఇక జుట్టును వదిలేసి తొలకరి జల్లులలో తడుస్తూ మళ్ళీ నా హ్యాపీ రోజులు వచ్చేసాయి అంటూ కామెంట్ చేసింది.

 

చీర కట్టులో తడి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సిమ్రాన్ ఈ ఫోటోలకు క్యాప్షన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తాజాగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ.." నా మనసుకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే చోటికి నేను తిరిగి వచ్చాను. మళ్లీ నా ఆనందపు క్షణాలు తిరిగి వచ్చాయి. ఇక ఈ ఫోటోలను చూసి నేను ఇంతగా ఆశ్చర్యపోవడానికి కారణం పవన్ అలాగే ప్రేమ్. మీ ఇద్దరితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా ఒక సహకారంలా అనిపించింది. మనం ఇది చేయగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైన ఫోటోలతో మళ్ళీ మీ ముందుకు రావాలని.. ఇలాంటి ఫోటోలను అద్భుతంగా క్యాప్చర్ చేయాలని పవన్, ప్రేమ్ లను నేను కోరుతున్నాను అంటూ కోరింది. మొత్తానికైతే సిమ్రాన్ షేర్ చేసిన ఈ ఫోటోలు, పంచుకున్న క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

 

12 ఏళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. పుట్టింది మాత్రం హైదరాబాదులోనే.. 1996 జూలై 17వ తేదీన జన్మించిన ఈమె హైదరాబాదులోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివి, సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకుంది. మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ఈమె 2012లో మిస్ ఆంధ్రప్రదేశ్ , టాలీవుడ్ మిస్ హైదరాబాద్, 2017లో ఫెమినా మిస్ ఇండియా, తెలంగాణ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

 

2014లో వచ్చిన హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత ఆ ఒక్కటి అడక్కు, వనవీర , సెహరి , పాగల్, చెక్ ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సిమ్రాన్.. తాజాగా ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News