మళ్లీ మాజీల నుంచి శ్రుతిహాసన్ కి సందేశాలా!
శ్రుతిహాసన్ ఇప్పుడు సింగిల్. బోయ్ ప్రెండ్స్ కి దూరంగా ఉంటూ సోలో లైఫ్ ని లీడ్ చేస్తోంది.;
శ్రుతిహాసన్ ఇప్పుడు సింగిల్. బోయ్ ప్రెండ్స్ కి దూరంగా ఉంటూ సోలో లైఫ్ ని లీడ్ చేస్తోంది. తొలుత మైఖెల్ కోర్సేలోతో సహజీవనం..అటుపై శంతను హజారికాతో బాండింగ్ వ్యవహారం తెలిసిందే. ఆ రెండు బ్రేకప్ ల నుంచి చాలా అనుభవాలు నేర్చుకుంది. అలాగని ప్రేమకు పెళ్లికి పూర్తిగా దూరం ఉంటుందని కాదు. మళ్లీ తప్పకుండా లవ్ లో పడతానని హింట్ ఇవ్వనే ఇచ్చింది.
మరి ఇప్పుడా ఇద్దరు మళ్లీ మెసెజ్ లతో టచ్ లోకి వస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే డాడ్ కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్` లో శ్రుతి హాసన్ గాయనిగా పాటలు పాడిన సంగతి తెలి సిందే. `ఈనాడు` సినిమా తర్వాత `థగ్ లైప్` సినిమాలో శ్రుతి హాసన్ పాట పాడటం ఇదే. విన్ వెలి నాయకా అంటూ అమ్మడు ఆలపిం చింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో లైవ్ పెర్పార్మెన్స్ కూడా ఇచ్చింది.
అప్పటి నుంచి శ్రుతిహాసన్ ఫోన్ ఇన్ బాక్స్...వాట్సాప్ మెసెజ్ లతో నిండిపోయిందిట. ఇప్పటికీ మెసెజ్ లు వస్తూనే ఉన్నాయంది. తన పనితనాన్ని మెచ్చుకుంటూ వస్తోన్న సందేశాలు తనకెంతో సంతోషాన్ని అంది స్తున్నాయంది. తనని ఇష్టపడే వాళ్లతో పాటు ఇష్టపడని వాళ్ల నుంచి కూడా మెసేజ్ లు వస్తున్నాయంది. దీంతో ఆ మెసెజ్ లు పంపిన వారిలో మాజీ ప్రేమికులు ఉన్నారంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ నెటి జనుడు నేరుగా శ్రుతి హాసన్ ని ఈ విషయం అడిగేసాడు. కానీ శ్రుతి హాసన్ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు. మౌనం అర్దాంగీకారం అంటారు. మరి నిజామా? కాదా? అన్నది శ్రుతి ధృవీకరించాలి. ప్రస్తు తం శ్రుతి హాసన్ `కూలీ`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా కొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.