సిల్క్ చీరలో క్లాసిక్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న బన్నీ బ్యూటీ!

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.;

Update: 2026-05-01 08:15 GMT

అందం అభినయంతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంటూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు హీరోయిన్లు. సినిమాల ద్వారానే కాకుండా ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.. ఈ క్రమంలోనే తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ నడుము అందాలతో గిలిగింతలు పెట్టేస్తోంది బన్నీ బ్యూటీ శ్రద్ధాదాస్. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ ని ప్రేమించే అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందులో ఈమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన శ్రద్ధాదాస్ తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా క్రీం కలర్ సిల్క్ చీర కట్టుకొని అందాలతో హొయలు పోయింది. క్రీం కలర్ శారీ, బ్లౌజ్ ధరించి జుట్టును ఫ్రీగా వదిలేసి.. తన అందాలతో మెస్మరైజ్ చేసింది. పరదా చాటున అందాలు అధరహో అనే రేంజ్ లో శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇకపోతే తన నెక్ ను ముత్యాలతో పొదిగిన చౌకర్తో ఫుల్ ఫిల్ చేయగా.. అదే ముత్యాలతో డిజైన్ చేసిన చేతి ఉంగరాలను ధరించి సింపుల్ లుక్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది శ్రద్ధదాస్ . తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.

 

ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు గార్జియస్ అని కామెంట్ చేస్తుంటే.. మరొకరు "సాధారణంగా నేను కామెంట్ చేయను.. కాకపోతే నీ అందాలు చూసి ఆగలేక కామెంట్ చేస్తున్నాను" అంటూ పెట్టారు. ఇంకొకరు అయితే" నీకు బాయ్ఫ్రెండ్ కావాలని ఉంది" అని ఇలా తమకు నచ్చిన విధంగా ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే శ్రద్ధదాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

1987 మార్చి 4న ముంబై మహారాష్ట్రలో శ్రద్ధదాస్ జన్మించింది. ఈమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. వీరు పురూలియా నుండి ముంబై వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె ముంబై విశ్వవిద్యాలయం నుండి జర్నలిస్ట్ రంగంలో డిగ్రీ పట్టా కూడా అందుకుంది. తొలిసారి 2008లో అల్లరి నరేష్ హీరోగా ఈశ్వర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న శ్రద్ధాదాస్.. ఆ తర్వాత టార్గెట్, అధినేత , ఆర్య 2 , డార్లింగ్ , నాగవల్లి, ముగ్గురు , మొగుడు ఇలా పలు చిత్రాలలో నటించింది. ఇక తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ , మలయాళం లో కూడా నటించిన ఈమె.. ఒక వెబ్ సిరీస్ లో కూడా సందడి చేసింది.

Tags:    

Similar News