• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీ క్లాసిక్స్...

హిందీ క్లాసిక్స్ స్క్రిప్టులు మాయ‌మైనా తెలుగు క్లాసిక్స్ అందుబాటులో!

| ‘షోలే’, ‘దీవార్’ వంటి చిత్రాల ఒరిజినల్ స్క్రిప్టులు ప్రస్తుతం అందుబాటులో లేవని ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. అప్పట్లో వాటిని భద్రపరచాలనే ఆలోచన రచయితలకు రాలేదన్నారు. మరోవైపు తెలుగులో ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’, ‘పాతాళ భైరవి’ వంటి క్లాసిక్స్ స్క్రిప్టులు పుస్తకాల రూపంలో అందుబాటులో ఉండటం విశేషం.

By - Sivaji Kontham
Update: 2026-11-29 18:30 GMT

భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిన కొన్ని చిత్రాల ఒరిజినల్ స్క్రిప్టులు కాలగర్భంలో కలిసిపోవడం నేటి దర్శక, రచయితలకు పెద్ద లోటుగా మారిందన‌డంలో సందేహం లేదు. ప్రముఖ రచయితల ద్వయం సలీం-జావేద్ (సలీం ఖాన్, జావేద్ అక్తర్) రాసిన షోలే, దీవార్ వంటి ఐకానిక్ చిత్రాల ఒరిజినల్ కాపీలు ప్రస్తుతం వారి వద్ద లేవని ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. ఈ అంశంపై తాను సలీం సాబ్.. తన తండ్రితో మాట్లాడినప్పుడు రచన సాగుతున్న వేగంలో ఆ పేజీలను భవిష్యత్తు కోసం భద్రపరచాలనే ఆలోచన వారికి అప్పట్లో కలగలేదని తెలిసిందని చెప్పారు. `త్రిశూల్` (1978) వంటి కొన్ని స్క్రిప్టులు తప్ప.. విలువైన రచనలను ఆర్కైవ్ చేసే సంస్కృతి తక్కువగా ఉండటం వల్ల ఆ స్క్రిప్టులకు సంబంధించిన‌ డ్రాఫ్ట్‌లు నేటి తరం రచయితలకు అందుబాటులో లేకుండా పోయాయని ఫర్హాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు హిందీ క్లాసిక్ స్క్రిప్టుల ఒరిజినల్ ప్రతులు లేవన్న చర్చ నడుస్తుండగా.. తెలుగు సినీ చరిత్రలో మాత్రం విజయా ప్రొడక్షన్స్ ద్వారా కొన్ని అరుదైన స్క్రిప్టులు పుస్తక రూపంలో అందుబాటులో ఉండటంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన `మాయాబజార్` స్క్రిప్టు అందుబాటులో ఉన్నట్లే, పాతాళ భైరవి (1951) చిత్రం పూర్తి స్క్రిప్టు (కథ, మాటలు, పాటల పుస్తకం) కూడా పాఠకులకు, సినీ పరిశోధకులకు అందుబాటులోనే ఉంది. కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పింగళి నాగేంద్రరావు అందించిన అద్భుతమైన సంభాషణలు, పాటలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

విజయా వారి మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ స్క్రిప్టుల సరసన నిలిచే `పాతాళ భైరవి` స్క్రిప్టు నేటి సినీ రచయితలు, విద్యార్థులకు ఒక అమూల్యమైన పాఠ్యపుస్తకంలా ఉపయోగపడుతోంది. విజయవాడ, హైదరాబాద్‌లోని ప్రముఖ తెలుగు పుస్తక కేంద్రాలు (నవోదయ, విశాలాంధ్ర వంటివి) స‌హా ఆన్‌లైన్ తెలుగు బుక్ స్టోర్స్ లోగిలి, కినిగే వంటి వేదికల ద్వారా ఈ పుస్తకాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే ఆర్కైవ్ డాట్ ఓఆర్‌జి వంటి డిజిటల్ లైబ్రరీలు, సినీ ఆర్కైవ్స్‌లోనూ పాత పాటల పుస్తకాలు లేదా సంభాషణల ప్రతుల రూపంలో వీటి జాడ కనిపిస్తుంటుంది.

మొత్తం మీద బాలీవుడ్ లెజెండ‌రీ ర‌చ‌యిత‌లు జావేద్- అక్త‌ర్ రాసిన షోలే, దీవార్ వంటి క్లాసిక్ డ్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడం రచనా ప్రక్రియను అధ్యయనం చేయాలనుకునే వారికి తీరని లోటు అనే చ‌ర్చ న‌డుమ‌.. తెలుగులో మాయాబజార్, పాతాళ భైరవి వంటి క్లాసిక్ చిత్రాల స్క్రిప్టులు అందుబాటులో ఉండటం కొంత ఊర‌ట‌. సినీ రచనలో ఉన్న డెప్త్‌ను అర్థం చేసుకునేందుకు నేటి దర్శక రచయితలకు ఈ స్క్రిప్టు పుస్త‌కాలు గొప్ప వరంగా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

Tags:    
  • farhanakhtar 
  • salimjaved 
  • sholay 
  • deewar 
  • pathalabhairavi 
  • mayabazar 

Similar News

ఆకాశంలో ఓ తార సినిమాలో చిరంజీవిని ఏడిపించిన సన్నివేశం ఏమిటో తెలుసా..?

2026-11-29 18:18 GMT

ఐకాన్‌స్టార్‌తో క‌న‌గ‌రాజ్ అలా ఉర్రూత‌లూగిస్తాడ‌ట‌

2026-11-29 16:30 GMT

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పక్కన టాలీవుడ్ ఎక్స్‌ప్రెస్!

2026-11-29 15:47 GMT

ఫోటో స్టోరి: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో బెబో దుమారం

2026-11-29 15:46 GMT

భద్రత సమస్య : పాక్ వెబ్ సిరీస్ పై నిషేదం...

2026-11-29 13:35 GMT

నీలి నీళ్లలో మెరిసిపోతున్న సోనాల్ అందం

2026-11-29 13:02 GMT

అందాల భామ‌కు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అత‌డే!

2026-11-29 11:00 GMT

రెహ్మాన్ ది గ్రేట్: కాల‌ప‌రీక్ష‌ను త‌ట్టుకుని క్రాఫ్ట్‌లో స‌త్తా చాటేవాడే సిస‌లైన క్రియేట‌ర్!

2026-11-29 10:59 GMT

48 ఏజ్‌లో నాన్న మ‌ర‌ణించిన‌పుడు నాపై పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి తెచ్చారు!

2026-11-29 10:54 GMT

ఆటో జానీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..

2026-11-29 10:51 GMT

ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన శ్రీలీల.. ఫొటోలు వైరల్!

2026-11-29 10:50 GMT

Copyright @2026

Powered by Blink CMS