• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  50 కాదు 62 స్క్రీన్లను...

50 కాదు 62 స్క్రీన్లను మూసేసిన పీవీఆర్ ఐనాక్స్

| ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50 స్క్రీన్లను మూసేస్తామని చెప్పిన సంస్థ.. తాజాగా అంతకు మించి అన్నట్లు 62 స్క్రీన్లను మూసేయటం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2024-02-01 04:28 GMT

ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది ప్రముఖ మల్టీఫ్లెక్స్ పీవీఆర్ ఐనాక్స్. ఇండియాతో పాటు శ్రీలంకలోనూ సినిమా స్క్రీన్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఆ మధ్యన ప్రముఖ మల్టీఫ్లెక్స్ ఐనాక్స్ ను తనలో విలీనం చేసుకోవటం తెలిసిందే. దీంతో.. మొన్నటివరకు పీవీఆర్ కాస్తా పీవీఆర్ ఐనాక్స్ గా మారటం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో కలిపి మొత్తం 113 నగరాలు.. పట్టణాల్లో కలిపి 1712 స్క్రీన్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50 స్క్రీన్లను మూసేస్తామని చెప్పిన సంస్థ.. తాజాగా అంతకు మించి అన్నట్లు 62 స్క్రీన్లను మూసేయటం గమనార్హం. అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో 29 స్క్రీన్లను ఏర్పాటు చేసింది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 170 స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. గడిచిన తొమ్మిది నెలల్లో మొత్తం 19 ప్రాంతాల్లో 97స్క్రీన్లను స్టార్ట్ చేసింది. కొవిడ్ తర్వాత.. అంతకు ముందున్న రోజుల్లోని గరిష్ఠ వసూళ్లను క్రాస్ చేసిన ప్రధాన మార్కెట్ ఒక్క ఇండియానే అన్న విషయాన్ని పీవీఆర్ ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ పేర్కొన్నారు. 2019లో రూ.10,948 కోట్లు వసూళ్లు చేయగా.. 2023లో ఈ మొత్తం రూ.12,226 కోట్లకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు.

డిసెంబరు త్రైమాసికంలో రూ.12.8 కోట్ల ఏకీక్రత నికర లాభాన్ని ఆర్జించినట్లుగా పేర్కొంది. 2022-23 ఇదే కాలంలో లాభం రూ.165 కోట్లు అయితే.. ఈసారి భారీగా తగ్గింది అయితే.. ఐనాక్స్ మల్టీఫ్లెక్సుల విలీనం నేపథ్యంలో గత ఏడాది లెక్కలతో పోల్చి చూడటం సరికాదని చెబుతోంది. డిసెంబరు త్రైమాసిక కాలంలో 3.65కోట్ల మంది తమ మల్టీఫ్లెక్సుల్లో సినిమాలు చూశారని.. సరాసరి టికెట్ ధర రూ.271గా లెక్క కట్టారు. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ కావటం గమనార్హం. థియేటర్లలో ఒక్కొక్కరు చేసే సగటు ఖర్చు రూ.132గా తేల్చారు. టికెట్ అమ్మకాలతో 14 శాతం.. ఆహార పానీయాలతో 8 శాతం.. ప్రకటనల విక్రయాలతో 23 శాతం ఆదాయాలు పెరిగినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా స్క్రీన్లు మూసేస్తున్నా.. కొత్తగా వస్తున్న వాటితో పోల్చినప్పుడు మల్టీఫ్లెక్సుల యాపారం మాంచి జోరు మీదనే సాగుతున్నట్లుగా చెప్పక తప్పదు.


Tags:    
  • Pvrinox 
  • Multiplexinox 
  • Srilanka 
  • MdAjaybijli 
  • Covid 

Similar News

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

Copyright @2026

Powered by Blink CMS